BigTV English

Winter Skin Care: చలికాలంలో చర్మంపై పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఇలా చేయండి

Winter Skin Care: చలికాలంలో చర్మంపై పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఇలా చేయండి

Winter Skin Care: చలికాలంలో చర్మం పొడిబారడం అనేది ఒక సాధారణ సమస్య. చలికాలంలో చర్మంలో తేమ తగ్గిపోవడంతో పాటు చర్మం పొడిబారడం మొదలవుతుంది. ఈ సమస్యను కొన్ని హోం రెమెడీస్ సహాయంతో తగ్గించుకోవచ్చు. హోం రెమెడీస్ చర్మం యొక్క తేమను పెంచడంతో పాటు చర్మానికి మృదుత్వాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి.


మన అమ్మమ్మల కాలం నుంచి చర్మ సంరక్షణకు సహజసిద్ధమైన వస్తువులనే వాడుతున్నారు. పొడి చర్మం సమస్యను ఎదుర్కోవటానికి హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి కొన్ని హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖం కోసం:


పెరుగు, తేనె మాస్క్: పెరుగు చర్మాన్ని తేమగా చేస్తుంది. అంతే కాకుండా తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పెరుగు, తేనెలను తగిన మోతాదుల్లో తీసుకుని రెండింటినీ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ పొడిబారకుండా ఉంటుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

అవకాడో మాస్క్: అవకాడోలో విటమిన్ ఇ ఉంటుంది.ఇది చర్మాన్ని తేమగా చేస్తుంది. దీన్ని మెత్తగా చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై పగుళ్లు రాకుండా ఉంటాయి. తరుచుగా అవకాడో ముఖానికి వాడటం వల్ల చర్మం తేమగా ఉంటుంది.

ముల్తానీ మిట్టి మాస్క్: ముల్తానీ మిట్టి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా స్కిన్‌పై ఉండే అదనపు నూనెలను గ్రహిస్తుంది.ముల్తానీ మిట్టిని రోజ్ వాటర్‌లో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆల్మండ్ ఆయిల్: నిద్రపోయే ముందు బాదం నూనెను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అంతే కాకుండా మెరిసిపోతుంది.

పసుపు, పాలు: పసుపులో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి. పాలు చర్మానికి తేమను అందిస్తాయి. రెండింటినీ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. తరుచుగా దీనిని ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మారుతుంది.

Also Read: వీటితో.. ముఖంపై మచ్చలు మాయం

శరీరం కోసం:ఓట్స్, పెరుగు స్క్రబ్: ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పెరుగు తేమగా మారుస్తుంది. ఓట్స్ , పెరుగును రెండింటినీ మిక్స్ చేసి బాడీని స్క్రబ్ చేసి తర్వాత కడిగేయాలి.

కొబ్బరినూనె: కొబ్బరినూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా చేస్తుంది. తలస్నానం చేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెను శరీరానికి రాసుకోవాలి.

తేనె,నిమ్మ రసం: తేనె చర్మాన్ని తేమగా చేస్తుంది. నిమ్మకాయ మృత కణాలను తొలగిస్తుంది. తేనె, నిమ్మరసాలను సమాన మోతాదుల్లో తీసుకునిమిక్స్ చేసి శరీరానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×