BigTV English

Home Remedies for Acidity: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ డ్రింక్స్ తాగండి!

Home Remedies for Acidity: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ డ్రింక్స్ తాగండి!

Natural Home Remedies for Acidity: ఆహారపు అలవాట్ల కారణంగా ఎసిడిటీ సమస్య చాలా మంది ఎదుర్కొంటున్నారు. బిజీ బిజీ జీవితాల్లో భాగంగా ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. జంక్ ఫుడ్, మాంసాహారం, మద్యపానం ఇలా హానికరమైన వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫలితంగా శరీరంలో యాసిడ్స్ ఎక్కువయ్యి జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.


ఎసిడిటీ సమస్య ఉన్న వారికి అజీర్తి, మలబద్ధకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు మార్కెట్లో దొరికే మందులు,హానికరమైన పానీయాలను తాగుతుంటారు. కానీ ఇవి ఏమాత్రం మంచివి కావు. ఇంట్లో సాధారణంగా ఉండే మూడు పదార్థాలతో ఎసిడిటీ సమస్య సహజంగా నయం చేసుకోవచ్చు.

ఎసిడిటీని అరికట్టేందుకు ఇంట్లో ఉండే జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ మూడింటిలో తయారుచేసిన పానీయాన్ని తాగితే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జీర్ణ సమస్యను నయం చేసుకోవచ్చు. ఈ డ్రింక్ తాగడం వల్ల కలిగే ఇతర లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Also Read: Knee Pain Relief Tips: మోకాళ్ల నొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. అయితే ఈ ఫుడ్‌ని డైట్‌లో చేర్చుకోండి..!

జీర్ణక్రియ:
జీలకర్ర, సోంపు గింజలు, జీర్ణ క్రియ లక్షణాలను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా జీలకర్ర జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపించే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఆహారాన్ని సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలోనూ జీలకర్ర, సోంపు గింజలు చక్కగా సహాయపడతాయి.

వాపును తగ్గిస్తుంది:
ధనియాలు, జీలకర్ర యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అదనపు యాసిడ్ ఉత్పత్తి వల్ల కలిగే కడుపు నొప్పి, వాపు వంటి వాటిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. చికాకు అసౌకర్యం నుంచి కూడా కాపాడతాయి.

ఆల్కలిన్ ప్రభావం:
సోంపు తినడం వల్ల శరీరంపై ఆల్కలిన్ ప్రభావం ఏర్పడుతుంది. ఎసిడిటీ కారణంగా వచ్చే గుండెలో మంట, నొప్పి వంటి సమస్యలకు కారణమయ్యే అదనపు ఆమ్లాలను ఇది తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

Also Read: వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే ఇన్ఫెక్షన్లకు గుడ్ బై చెప్పొచ్చు !

ఉబ్బరం తగ్గిస్తుంది:
గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు జీలకర్ర, సోంపు ఉపయోగపడతాయి.

రిలాక్సింగ్ ఎఫెక్ట్:
ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు ఒత్తిడి నయం చేసేందుకు చక్కటి ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా కడుపు, ఛాతిలో వచ్చే నొప్పి, మంట వంటి సమస్యలను త్వరగా నయం చేస్తాయి.

ఎసిడిటీ తగ్గడం కోసం ఇంట్లోనే తయారు చేసుకునే డ్రింక్:
కావలసివి

  •  స్పూన్ జీలకర్ర
  • ఒక స్పూన్ ధనియాలు
  • ఒక స్పూన్ సోపు గింజలు
  • రెండు కప్పుల నీరు

తయారీ విధానం: ఒక గిన్నెలో నీటిని తీసుకుని వాటిలో జీలకర్ర, ధనియాలు సోంపు గింజలను వేసి మరిగించాలి. ఆ తర్వాత ఈ పానీయాన్ని వడగట్టి గోరువెచ్చగా అయ్యాక తాగాలి. అంతే మీ ఎసిడిటీ సమస్య త్వరగా నయం అవుతుంది.

Related News

Raw vs Roasted Nuts: పచ్చి గింజలు Vs వేయించిన గింజలు.. ఏవి తింటే మంచిది ?

Junnu Recipe: జున్ను పాలు లేకుండానే జున్ను తయారీ.. సింపుల్‌గా చేయండిలా !

Papaya Seeds: బొప్పాయి సీడ్స్ తింటే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Walking Backwards: రోజూ 10 నిమిషాలు వెనక్కి నడిస్తే.. ఇన్ని లాభాలా ?

Homemade Hair Spray: ఈ హెయిర్ స్ప్రే వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ?

Ghee With Hot Water: డైలీ మార్నింగ్ గోరు వెచ్చటి నీటిలో నెయ్యి కలిపి తాగితే.. మతిపోయే లాభాలు !

African Swine Fever: ప్రమాదకర రీతిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి.. మరో ముప్పు తప్పదా ?

Healthy Diet Plan: 30 ఏళ్లు దాటితే.. ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ?

Big Stories

×