Ariyana Glory: అరియానా గ్లోరి(Ariyana Glory) పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలు ఇండస్ట్రీకి పరిచయమై ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్న వారిలో అరియానా కూడా ఒకరు. ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా యాంకర్ గా మారి ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఎప్పుడైతే అరియానా సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ (Ram Gopal Varma)వర్మతో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారో ఆ క్షణం నుంచి ఈమె భారీగా పాపులర్ అయ్యారు. ఈ పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని కూడా అందుకున్నారు.
హాట్ వీడియో షేర్ చేసిన అరియానా…
ఇలా రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేయడమే కాకుండా పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న అరియానా ఇటీవల కాలంలో తన స్పీడ్ కాస్త తగ్గించిందని చెప్పాలి. ఇటీవల బుల్లితెర కార్యక్రమాలలో కూడా అరియానా పెద్దగా కనిపించలేదు. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తూ ఉంటారు. తాజాగా ఈమె ఇలాంటి ఒక వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
నల్లంచు తెల్లచీర ఎప్పుడు స్పెషల్…
ఈ వీడియోలో ఈమె చీర కట్టుకున్నప్పటికీ చీరలో తన అందాలన్నింటినీ ఆరబోస్తూ కనిపించారు. ఇలా తన యద అందాలతో పాటు నడుము మడతలను కూడా ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రకారులకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఇక ఈ వీడియోకి ఈమె” జడివానై ప్రియా ననే చేరుకొనీ” అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్ క్రియేట్ చేశారు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన అరియానా నల్లంచు తెల్లచీర ఎప్పుడు స్పెషల్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ వీడియో చూసిన ఎంతోమంది సూపర్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ప్రియుడి రాక ఈమె ఎంతగానో ఎదురు చూస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link
ఇలా చీర కట్టులో అరియానా ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా తన అందాలన్నింటినీ ఆరబోస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఇక ఒకప్పుడు చాలా బక్కగా ఉన్న అరియానా ఇటీవల కాలంలో చాలా ముద్దుగా, బొద్దుగా తయారవుతున్నారని చెప్పాలి. అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలు వీడియోల పై సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో విమర్శలు కూడా వస్తుంటాయి. అయితే ఇలాంటి విమర్శలను తాను పట్టించుకోనని ఒకానొక సమయంలో ఈమె ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అరియానా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అవ్వడం కోసం ఎంతగానో కష్టపడుతూ బిజీగా ఉన్నారు.