Instant Glow: బియ్యం , పచ్చి పాలు ముఖ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో తయారు చేసిన సులభమైన ఫేస్ ప్యాక్ మీ చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.
ఉదయం నిద్ర లేవగానే అద్దంలో మీ చర్మాన్ని చూసుకుని నవ్వగలిగితే, ఆ రోజు ఎంత అందంగా ప్రారంభమవుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ చర్మం మెరిసిపోవాలని.. కాంతివంతంగా కనిపించాలని, అది కూడా ఎక్కువ ఖర్చు లేకుండానే కావాలని కోరుకుంటారు. ఇందుకోసం బియ్యం పిండితో పాటు పాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మీ చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా తక్షణ కాంతిని అందిస్తాయి. ఇంతకీ బియ్యం పండితో పాటు పాలను ఉపయోగించి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం, పచ్చి పాలతో ఫేస్ ప్యాక్:
చర్మ సంరక్షణకు ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. వాటికి బదులుగా వంటగదిలో ఉన్న కొన్ని రకాల పదార్థాలు కూడా మీ చర్మాన్ని అందంగా మారుస్తాయి. బియ్యం , పచ్చి పాలు రెండూ మీ చర్మాన్ని లోపలి నుండి పోషించి, సహజమైన మెరుపును ఇచ్చే పదార్థాలు.
బియ్యం చర్మానికి ఎందుకు మేలు చేస్తుంది ?
బియ్యంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ , ఫెరులిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి . అంతే కాకుండా మచ్చలను కూడా తగ్గిస్తాయి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అంతే కాకుండా చర్మ రంధ్రాలు తెరుచుకునే స్వభావాన్ని కూడా తగ్గిస్తుంది.
పచ్చి పాలు ఎలా ఉపయోగపడతాయి ?
పచ్చి పాలలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇవి చర్మపు రంగును సమం చేస్తాయి. అంతే కాకుండా సహజమైన మెరుపును ఇస్తాయి.
ఫేస్ ప్యాక్ తయారు చేసుకునే విధానం:
2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి లేదా నానబెట్టిన బియ్యం పేస్ట్
3 టీస్పూన్లు పచ్చి పాలు
1 చిటికెడు పసుపు
Also Read: ఒత్తైన జుట్టు కోసం.. కొరియన్స్ ఏం చేస్తారో తెలుసా ?
బియ్యాన్ని 2-3 గంటలు నానబెట్టి.. ఆపై రుబ్బుకోవాలి లేదా నేరుగా బియ్యం పిండి తీసుకోవాలి.
దానికి పచ్చి పాలు వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. పసుపును కూడా ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్యాక్ ను ముఖం, మెడపై అప్లై చేయండి. 15-20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి 2 నుండి 3 సార్లు అప్లై చేయడం మంచిది.