BigTV English

Holiday Spots Measles: హాలిడే స్పాట్స్‌లో మెదడు వాపు వ్యాధి ఇన్‌ఫెక్షన్ .. ఈ ప్రదేశాలకు వెళితే ప్రమాదం

Holiday Spots Measles: హాలిడే స్పాట్స్‌లో మెదడు వాపు వ్యాధి ఇన్‌ఫెక్షన్ .. ఈ ప్రదేశాలకు వెళితే ప్రమాదం

Holiday Spots Measles| విదేశీ టూరిస్టులు వెళ్లే టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో మెదడు వాపు వ్యాధి ఇన్‌ఫెక్షన్ ప్రమాదం పొంచి ఉందని యునైటెడ్ కింగ్‌డమ్‌ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశారు. ఈ మెదడు వాపు కలిగించే వ్యాధి సెలవు గమ్యస్థానాల్లో వేగంగా వ్యాపిస్తోందని యుకె ఆరోగ్య అధికారులు మీజిల్స్ వ్యాధి గురించి తీవ్ర హెచ్చరించారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) ప్రకారం.. గత సంవత్సరం యూరప్‌లో మీజిల్స్ కేసులు.. దాదాపు 30 ఏళ్లలో అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి.


విదేశాలకు ప్రయాణించిన వారు ఈ వ్యాధిని దేశంలోకి తీసుకొచ్చే ప్రమాదం ఉందని UKHSA హెచ్చరించింది. పిల్లలకు మీజిల్స్, గవద బిళ్లలు, రుబెల్లా (MMR) టీకాలు రెండు డోసులు తప్పనిసరిగా వేయించాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గత ఏడాది యూరప్‌లో 1,27,350 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. ఇది 2023 కంటే రెట్టింపు సంఖ్య. 1997 తర్వాత ఇదే అత్యధికం.

ఈ సంవత్సరం ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీలలో మీజిల్స్ వ్యాప్తి గుర్తించబడింది. టీకాలు వేయని పిల్లలు, పెద్దలతో కూడిన కుటుంబాలు విదేశాలకు ప్రయాణిస్తే.. ఈ వేసవిలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని.. యుకెహెచ్ఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. “మీజిల్స్ అత్యంత వేగంగా వ్యాపించే వ్యాధి, టీకా వేయని వారిలో ఇది త్వరగా వ్యాపిస్తుంది.” అని ఆరోగ్య అధికారులు తెలిపారు.


మీజిల్స్ అంటే ఏమిటి?
మీజిల్స్ అనేది వేగంగా వ్యాపించే వ్యాధి. ఇది శరీరంపై దద్దుర్లు, జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. వైద్యులు ప్రకారం, ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. మెదడు వాపు, న్యుమోనియా వంటి ప్రాణాంతక సమస్యలను కలిగిస్తుంది. ఇతర ఇన్ఫెక్షన్లకు కూడా గురయ్యే అవకాశం పెరుగుతుంది. టీకాలు సాధారణం కాకముందు, మీజిల్స్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మరణాలకు కారణమైంది.

మీజిల్స్ లక్షణాలు
మీజిల్స్ లక్షణాలు ఒకేసారి కనిపించవు. మొదట జ్వరం, దగ్గు, ముక్కు కారడం, కళ్లు ఎర్రబడడం కనిపిస్తాయి. రెండు-మూడు రోజుల తర్వాత నోటిలో తెల్లగా, ఎరుపు మచ్చలు (కొప్లిక్ స్పాట్స్) కనిపించవచ్చు. ఆ తర్వాత మూడు నుండి ఐదు రోజులలో దద్దుర్లు కనిపిస్తాయి.

ఇతర క్షణాలు:

  • అధిక జ్వరం
  • గొంతు నొప్పి
  • కండరాల నొప్పి
  • తీవ్ర అలసట
  • జీర్ణ సమస్యలు (విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు)
  • గొరగొర దగ్గు
  • తలనొప్పి

మీజిల్స్ ఎలా వస్తుంది?
మీజిల్స్‌కు కారణం మోర్బిల్లివైరస్ అనే వైరస్. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఆసుపత్రిలో ఉన్న వ్యక్తి శ్వాస పీల్చుకొని వదిలేస్తే.. ఆ శ్వాస వల్ల, దగ్గడం, తుమ్మడం లేదా మాట్లాడటం ద్వారా వైరస్ గాలిలోకి వస్తుంది. ఈ చుక్కలు రెండు గంటల వరకు గదిలో ఉండవచ్చు. వైరస్ ఉన్న ఉపరితలాన్ని తాకి, తర్వాత నోరు, ముక్కు, లేదా కళ్లను తాకడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. గర్భిణీ స్త్రీ నుంచి ఆమె శిశువుకు కూడా వ్యాపించవచ్చు. హాలిడే సెలవులకు వెళ్లే ముందు ఎంఎంఆర్ (MMR) టీకాలు వేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండాలని యుకె ప్రభుత్వం సూచిస్తోంది.

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×