BigTV English

Samantha: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’ లో బాలీవుడ్ నటుడు.. ప్రత్యేక శిక్షణ అంటూ క్లారిటీ..!

Samantha: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’ లో బాలీవుడ్ నటుడు.. ప్రత్యేక శిక్షణ అంటూ క్లారిటీ..!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత(Samantha ) అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా భర్త నాగ చైతన్య (Naga Chaitanya) నుండి విడిపోయిన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈమె.. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయింది. ఇక ఆ వ్యాధి నుంచి తేరుకోవడానికి ఒక ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. గత ఏడాది ‘సిటాడెల్ – హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈమధ్య కాలంలో వరుస సూపర్ హిట్ సీరీస్ లతో ఆకట్టుకునే దర్శకద్వయం రాజ్ అండ్ డీకే దీనిని తెరకెక్కిస్తున్నారు.


రాక్త్ బ్రహ్మాండ్ లో మీర్జాపూర్ నటుడు..

ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ (Adithya Rai Kapoor), సమంతతో పాటు కీలక పాత్రలో మరో బాలీవుడ్ నటుడు నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించారు. ఆయన ఎవరో కాదు ‘మీర్జాపూర్’ నటుడు అలీ ఫజల్ (Ali Fazal). తాజాగా ఒక ఇంటర్వ్యూలో అలీ ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ.. “ఈ వెబ్ సిరీస్ కోసం నేను మార్షల్ ఆర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్ లలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాను.నా పాత్రలో ఫిట్గా కనిపించడం కోసం నిరంతరం కష్టపడుతున్నాను” అంటూ ఆయన తెలిపారు. అంతేకాదు “రోజుకు 7:00 వ్యాయామం చేస్తున్నాను” అంటూ కూడా అలీ వెల్లడించారు. “లుక్ కోసం జుట్టు పెంచుకుంటున్నాను
అన్నటికంటే పెద్ద సవాలు నా శరీరాన్ని, మనసును, శక్తికి మించి కష్టపెడుతున్నాను. మీర్జాపూర్ కోసం శిక్షణ తీసుకున్న ట్రైనర్ దగ్గరే ఇప్పుడు కూడా నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇప్పటివరకు చేసిన అన్ని ప్రాజెక్టుల కంటే ఈ ‘రక్త్ బ్రహ్మాండ్’ విభిన్నమైనది. ఇది ప్రేక్షకులకు కచ్చితంగా థ్రిల్ ను పంచుతుంది ” అంటూ అలీ వెబ్ సిరీస్ పై అంచనాలు పెంచేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


రూమర్స్ పై స్పందించిన డైరెక్టర్స్..

ఇకపోతే ఈ “రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్” వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఇటీవలే ఈ సిరీష్ షూటింగ్ ఆగిపోయిందని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ వెబ్ సిరీస్ ఆగిపోయిందని కామెంట్లు కూడా వినిపించాయి. అయితే వీటిని దర్శకులు ఖండిస్తూ పరోక్షంగా స్పందించారు. సెట్స్ లో దిగిన పలు ఫోటోలను పంచుకుంటూ తమ ప్రాజెక్టులు ఆగిపోలేదని అభిమానులకు సంతోషాన్ని కలిగించారు. ఇక తమ పని గొప్పగా చేసుకుంటూ వెళ్తున్నామని కూడా ఆయన తెలిపారు.ఇలా మొత్తానికైతే రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ గురించి వచ్చిన రూమర్లన్నింటికీ కూడా దర్శకులు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు అలీ ఫజల్ కూడా వెబ్ సిరీస్ పై అంచనాలు పెంచేశారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×