RAPO22 Title Glimpse:యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఈయనను మాస్ హీరోగా కూడా మార్చి పూరీ జగన్నాథ్ (Puri Jagannath) సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అలా సాఫ్ట్ క్యారెక్టర్లే కాదు మాస్ క్యారెక్టర్స్ తో కూడా ఆకట్టుకోగలను అని నిరూపించుకున్న హీరో రామ్ పోతినేని. ఇకపోతే ఇటీవల ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ వరుసగా పరాజయాలు చవిచూసిన రామ్ పోతినేని.. కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్లీ #RAPO 22 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు. పి (Maheshbabu.P )దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్నారు. ఇక రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈరోజు రామ్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఈ సినిమా నుండి టైటిల్ రిలీజ్ తో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఇక ఈ గ్లింప్స్ లో ఫ్యాన్స్ కోరుకున్న డైలాగ్స్ రిలీజ్ చేశారో లేదో ఇప్పుడు చూద్దాం
RAPO 22 టైటిల్, గ్లింప్స్ రిలీజ్..
ఇకపోతే తాజాగా #RAPO22 మూవీ నుండి విడుదల చేసిన గ్లింప్స్ లో రామ్ పోతినేని ఫ్యాన్ సాగర్ అనే పాత్రలో నటించగా.. సూపర్ హీరో క్యారెక్టర్ లో సూర్య కుమార్ అనే పాత్రలో ఉపేంద్ర (Upendra) నటిస్తున్నారు. ఇకపోతే “ఫాన్స్ అడిగితే 5 టికెట్లు ఏమిటి? 50 టికెట్లు అయినా ఇచ్చి తీరాల్సిందే” అనే డైలాగ్ ఈ గ్లింప్స్ లో ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున డైలాగ్ వైరల్ చేసిన విషయం తెలిసిందే. కానీ గ్లింప్స్ లో మాత్రం ఈ డైలాగ్ రివీల్ చేయలేదు. దీంతో ఈ డైలాగ్ కోసం ఎదురుచూసిన అభిమానులకు కాస్త నిరాశ మిగిలిందనే చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు..
గ్లింప్స్ లో ఏముందంటే..?
గ్లింప్స్ విషయానికి వస్తే.. థియేటర్ వద్ద అభిమానులు తమ అభిమాన హీరో సినిమా రాబోతుండడంతో తెగ హడావిడి చేస్తూ ఉంటారు. అటు థియేటర్ యాజమాన్యం కూడా టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలి అంటూ ఫోన్ లో ఎంక్వయిరీ చేస్తూ ఉంటారు. అందులో ఎమ్మెల్యే తాలూకా అంటూ కొంతమందికి టికెట్లను కేటాయిస్తారు. ఆ తర్వాత మరికొంతమంది టికెట్ కోసం ఫోన్ చేసిన టికెట్లు లేవని, ఆంధ్ర సూపర్ కింగ్ మూవీ అండి టికెట్లు లేవని థియేటర్ యాజమాన్యం చెబుతుంది. హౌస్ఫుల్ బోర్డులు కూడా పెట్టేస్తారు. ఇక అప్పుడే రామ్ ఎంట్రీ ఉంటుంది. ఆంధ్ర కింగ్స్ అనే ఒక బ్యానర్ తలకు చుట్టుకొని సైకిల్లో వస్తూ.. ఒక్కసారిగా సైకిల్ పక్కకు తోసేస్తాడు. టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళిన రామ్ టికెట్ కావాలి అని అడుగుతాడు. ఎవరి తాలూకా అంటే ఫ్యాన్ తాలూకా.. 50 టికెట్లు కావాలి అని అడిగితే.. వెంటనే సదరు థియేటర్ యాజమాన్యం టికెట్లు ఇచ్చేస్తారు. కట్ చేస్తే ఉపేంద్ర భారీ కటౌట్ వద్ద ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అంటూ రామ్ టైటిల్ రివీల్ చేస్తారు. దీంతో గ్లింప్స్ ఎండ్ అవుతుంది. ఇకపోతే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆడియన్స్ కి ఈ గ్లింప్స్ పెద్దగా ఆకట్టుకున్నట్లు కనిపించలేదు. పైగా భాగ్యశ్రీ తో ఏదైనా షాట్ పెడతారు అనుకుంటే.. అది కూడా లేదనే చెప్పాలి. మొత్తానికైతే రామ్ బర్త్డే స్పెషల్గా వచ్చిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను నిరాశపరిచింది అని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ:Tamannaah: బ్రేకప్ తర్వాత… రహస్యంగా తమన్నా పెళ్లి.. ఫోటోలు వైరల్.. నిజమేనా?