BigTV English

Homemade Hair Serum: జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గించే హెయిర్ సీరం ఇదే !

Homemade Hair Serum: జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గించే హెయిర్ సీరం ఇదే !

Homemade Hair Serum: ప్రస్తుతం ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలితో పాటు తప్పుడు ఆహారపు అలవాట్లతో పాటు కాలుష్యం కారణంగా మీ జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే చాలా మంది మార్కెట్‌లో లభించే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు కానీ వాటిలో ఉండే రసాయనాలు మీ కొన్నిసార్లు సమస్యను మరింత పెంచుతాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం మంచిది. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఇంట్లోనే హెయిర్ సీరంలను తయారు చేసుకుని వాడవచ్చు.


హోం రెమెడీస్ ఉత్తమమైనవి అంతే కాకుండా సురక్షితమైనవి కూడా. రెండు సులభమైన , ప్రభావవంతమైన హోమ్ సీరమ్‌ల తయారీతో పాటు వాటిని ఉపయోగించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్‌తో హెయిర్ సీరం:


ఈ హెయిర్ సీరం తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న బాటిల్ తీసుకుని అందులో 2 టీస్పూన్ల బాదం నూనె వేయాలి. తర్వాత 5-6 చుక్కల రోజ్ వాటర్ వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇలా చేయడం వల్ల ఈ రెండు బాగా కలిసిపోతాయి. మీరు తలస్నానం చేసి జుట్టు ఆరిన తర్వాత
ఈ సీరమ్‌ను అప్లై చేయండి. మీ వేళ్లతో తలపై సున్నితంగా సీరంతో మసాజ్ చేయండి. ఈ సీరమ్‌ని పొడవు జుట్టుకు కూడా అప్లై చేయవచ్చు.

అలోవెరా, కొబ్బరి నూనె సీరం:
తాజా అలోవెరా జెల్‌ను 2 టీస్పూన్లు తీసుకోండి. దీనికి 1 టీస్పూన్ కొబ్బరి నూనె కలపండి. వీటిని బాగా మిక్స్ చేయండి. ఇలా చేసినప్పుడు తద్వారా మందపాటి , మృదువైన సీరం ఏర్పడుతుంది. జుట్టు వాష్ చేసిన తర్వాత ఆరిన జుట్టుకు ఈ సీరమ్‌ను అప్లై చేయండి. వేళ్ల సహాయంతో తలకు మృదువుగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆముదం, కొబ్బరి నూనెతో సీరం:
ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆముదం, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెతో పాటు 5-7 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ (లావెండర్ లేదా రోజ్మేరీ) కలపండి. తర్వాత దీనిని మీ జుట్టుకు అప్లై చేయండి. ఇలా మసాజ్ చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. లేదా రాత్రిపూట అప్లై చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా, జోజోబా ఆయిల్‌తో సీరం:
ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్‌తో పాటు 5 చుక్కల రోజ్మేరీ ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయండి. తలస్నానం చేసే సుమారు గంట ముందుు ఈ సీరమ్ అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు షైనీగా మారుతుంది.

ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్‌తో సీరం:
2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని , 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ , ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకుని వీటన్నింటినీ ఒక గిన్నెలో కలపండి. ఈ సీరమ్‌ను మీ జుట్టు స్కాల్ప్‌కు అప్లై చేసి 30 నిమిషాలు లేదా ఒక గంట పాటు అలాగే ఉంచండి.

Also Read: ఈ ఆయిల్స్ ఒక్కసారి వాడినా చాలు.. మీ అందం రెట్టింపు

గ్రీన్ టీ , అర్గాన్ ఆయిల్ సీరం:
½ కప్పు బ్రూ గ్రీన్ టీ తీసుకుని చల్లబరచండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆర్గాన్ ఆయిల్ , 5 చుక్కల పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. మీ తలపై సీరమ్‌ను అప్లై చేయడానికి కాటన్ బాల్ ఉపయోగించండి. తర్వాత మృదువుగా మసాజ్ చేయండి. మీ జుట్టును వాష్ చేయడానికి 30 నిమిషాల ముందు దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×