ప్రోటీన్ మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. ఇది కండరాల నిర్మాణం, ఎముకల బలం, శరీర కణాల మరమ్మతుకు సహాయపడుతుంది. అయితే చాలా మంది రోజూ అవసరమైనంత ప్రోటీన్ తీసుకోలేరు. ముఖ్యంగా శాకాహారులు సరిపడా ప్రోటీన్ పొందడం కొంచెం కష్టంగా ఉంటుంది. మార్కెట్‌లో దొరికే ప్రోటీన్ పౌడర్లలో కృత్రిమ పదార్థాలు ఉంటాయని భావించి కొందరు వాటిని ఉపయోగించడానికి ఆసక్తి చూపరు. అలాంటి వారికి ఇంట్లోనే తయారుచేసే ప్రోటీన్ పౌడర్ మంచి ప్రత్యామ్నాయం.
ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ నితేశ్ సోనీ సోషల్ మీడియాలో సహజ పదార్థాలతో తయారు చేసే ప్రొటీన్ పౌడర్‌ని సూచించారు. దీని తయారు చేసే రెసీపీని ఇప్పుడు తెలుసుకుందాం
ఈ ప్రోటీన్ పౌడర్ తయారీకి కొన్ని సాధారణ పదార్థాలు సరిపోతాయి.
ఈ పదార్థాల్లో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి.
అన్ని పదార్థాలను ఒక పెద్ద మిక్సీ జార్‌లో వేయాలి. తరువాత వాటిని మెత్తగా పొడిలా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. పౌడర్ బాగా కలిసేలా చూసుకోవాలి. తయారైన పొడిని శుభ్రమైన గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. చల్లని, పొడి ప్రదేశంలో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ప్రతి సారి పౌడర్ డబ్బా నుంచి తీసుకునేటప్పుడు ఒక డ్రై స్పూన్ తోనే తీయాలి.
రోజుకు సుమారు 30 గ్రాముల ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. 200 మిల్లీలీటర్ల పాలు లేదా గోరువెచ్చని నీటిలో ఈ పౌడర్ కలిపి తాగవచ్చు. స్మూతీలలో కూడా కలిపి తీసుకోవచ్చు. కొందరు ఓట్స్ లేదా గంజిలో కలిపి కూడా తీసుకుంటారు. అయితే ఇది సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటేనే మంచి ఫలితాలు ఇస్తుంది.
ఈ ఇంటి ప్రోటీన్ పౌడర్‌లో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేయించిన శనగలు మంచి ప్లాంట్ బేస్ ప్రోటీన్, ఫైబర్‌ను అందిస్తాయి. వేరుశెనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. బాదం, జీడిపప్పు శరీరానికి అవసరమైన ఖనిజాలు, మంచి కొవ్వులను అందిస్తాయి. మఖానాలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండు ఖర్జూరాలు సహజ తీపితో పాటు ఎనర్జీ ఇస్తాయి. సోంపు, యాలకులు (ఇలాయిచీ) రుచి, సువాసనను పెంచుతాయి. ఈ మిశ్రమంలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి.
ఇందులో మనకు తెలిసిన సహజ పదార్థాలే ఉంటాయి. మనం తయారు చేసుకునే పౌడర్ కాబట్టి దీని క్వాలిటీని మనమే నియంత్రించవచ్చు. కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌ల అవసరం ఉండవు. ఇంట్లో తయారుచేసిన ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి ఎంపికగా ఉంటుంది.
Also Read: శరీరంలో నుంచి మలినాలు తొలగించే సూపర్ డ్రింక్స్.. లివర్ ఆరోగ్యానికి ఆయుర్వేద డాక్టర్ సూచనలు
సహజ పదార్థాలైనా కొందరికి అలెర్జీ కలిగించే అవకాశం ఉంటుంది. ఇందులో ఉపయోగించే గింజలకు అలెర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ సమస్యలు, మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పౌడర్‌ను ఉపయోగించే ముందు వైద్యుడు లేదా అర్హత కలిగిన పోషకాహార నిపుణుడిని సంప్రదించాలి. అలాగే పూర్తి భోజనం మానేసి ప్రత్యామ్నాయంగా తాగకూడదు.
ఇంట్లో తయారుచేసే ప్రోటీన్ పౌడర్ రోజువారీ ప్రోటీన్ అవసరాన్ని తీర్చడంలో ఉపయోగపడుతుంది. అయితే సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు తీసుకున్నప్పుడే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి.