BigTV English

Viral Video: ట్రైన్‌లో డేంజర్ స్టంట్ చేయబోయిన కూతురు.. పొట్టుపొట్టు కొట్టిన తల్లి.. ఇదిగో వీడియో

Viral Video: ట్రైన్‌లో డేంజర్ స్టంట్ చేయబోయిన కూతురు.. పొట్టుపొట్టు కొట్టిన తల్లి.. ఇదిగో వీడియో

Viral Video: ఇటీవల కాలంలో కొంత మంది ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్, వైరల్ అయ్యేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ముఖ్యంగా యువత రీల్స్ కోసం ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యువతి ఇన్ స్టా రీల్ కోసం ట్రైన్ లో ఫుట్ పాత్‌పై డేంజర్ స్టంట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో యువతి తల్లి ఆగ్రహంతో ఆమెను చెంపలపై కొట్టడంతో వీడియో ఇంకాస్త సెన్సేషనల్ గా మారింది. ఇది తల్లిదండ్రుల బాధ్యత.. సోషల్ మీడియాలో ఇన్ ఫ్యూయెన్సర్ల ప్రవర్తన తీరు గురించి తెలియజేస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


21 ఏళ్ల సైబా రైలులో ఫుట్ పాత్‌పై నిలబడి ఇన్ స్టా రీల్ కోసం వీడియో చేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రమాదకరమైన స్టంట్ ను చూసిన ఆమె తల్లి.. సైబా వద్దకు వచ్చి మండిపడింది. ఇంతటితో ఓరుకోకుండా.. చెంపలపై ఎడాపెడా మూడు, నాలుగు దెబ్బలు వాయించింది. ఆ తర్వాత సైబా భయపడి సారీ చెబుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. వేల కొద్ది కామెంట్ల ప్రవాహం కొనసాగుతోంది.

?utm_source=ig_web_copy_link


ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. చాలా మంది యువతి తల్లిని సమర్థించారు. కూతురికి సరైన బుద్ధి చెప్పిందని కామెంట్ చేసుకొస్తున్నారు. ఆమె తన కూతురిని ప్రమాదం నుండి కాపాడడానికి తీసుకున్న చర్యను ఓ బాధ్యతాయుతమైన తల్లిగా పొగడ్తల వర్షం కురిపించారు. ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. ‘ప్రతి ఒక్కరికీ ఇలాంటి తల్లి ఉండాలి’ అని కామెంట్ చేశారు. మరొకరు హాస్యాస్పదంగా.. ‘ఆంటీ ఆమెను మరో డైమెన్షన్‌లోకి పంపేసింది’ అని రాశారు. అయితే, కొందరేమో.. ఈ వీడియో కావాలనే క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. కేవలం వ్యూస్ కోసం ఇలా చేసి ఉండొచ్చని.. ఇలా చేయడం ఏ మాత్రం సరికాదని కామెంట్ చేసుకొచ్చారు.

ALSO READ: King Cobra Video: 18 అడుగుల కింగ్ కోబ్రాను చేతితో ఎలా పట్టుకున్నాడో చూడండి.. వీడియో వైరల్

ఈ సంఘటన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు కంటెంట్ క్రియేట్ విధానంపై మళ్లీ చర్చకు దారి తీసింది. చాలామంది యువత, ఫాలోవర్స్ లైక్‌ల కోసం ప్రమాదకరమైన స్టంట్‌లకు పాల్పడుతున్నారు. ఇది తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. ఈ వీడియో ద్వారా, తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలపై ఎంత శ్రద్ధ వహించాలి అనే అంశం కూడా హైలైట్ అయింది. అదే సమయంలో, కొందరు ఈ చెంపదెబ్బను బహిరంగంగా కొట్టడం సరైనదా కాదా అనే విషయంపై కామెంట్ బాక్స్ లో డిబేట్ చేస్తున్నారు.

ఈ వైరల్ వీడియో సోషల్ మీడియా యుగంలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లను, తల్లిదండ్రుల బాధ్యతను, ఆన్‌లైన్ కంటెంట్ క్రియేట్ చేసే విధానాన్ని సమాజం ముందుకు తెచ్చింది. సైబా తల్లి తన కూతురిని ప్రమాదం నుండి కాపాడేందుకు తీసుకున్న చర్యను చాలామంది అభినందించినప్పటికీ, ఈ ఘటన సోషల్ మీడియా సానుకూల, ప్రతికూల అంశాలను ఒకసారి ఆలోచించేలా చేస్తుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు తమ కంటెంట్‌ను సృష్టించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఈ ఘటన ఒక గుణపాఠంగా నిలుస్తుందని చెప్పవచ్చు.

Related News

Ganesh Utsav Viral Video: గణపయ్య నిమజ్జనం.. వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి.. వీడియో చూస్తే కన్నీళ్లు గ్యారంటీ!

Viral News: ఒక బీహెచ్‌కే ఫ్లాట్‌కి లక్ష ఇరవై వేలా… షాక్ లో నెటిజన్లు.. ఎక్కడో తెలుసా?

Viral Video: కదులుతున్న రైలుకు వేలాడేతూ డేంజర్ స్టంట్, పైగా అమ్మాయిని టచ్ చేస్తూ..

Hundi Chori: గుడిలో చోరీ.. ఆ తర్వాతి రోజే దొంగ ఇంట్లో ఊహించని ఘటన, దెబ్బకు డబ్బులు తిరిగిచ్చేశాడు!

Viral Video: భార్య కోరిక తీర్చనందుకు భర్తను కుమ్మేసింది.. చివరకు ఏం జరిగింది? వైరల్ వీడియో

Bird wedding festival: ఇక్కడ యువకులకు పెళ్లి నిల్.. పక్షులకు మాత్రం గ్యారెంటీ.. ఈ వెరైటీ కల్చర్ ఎందుకంటే?

Big Stories

×