Big Tv Live Originals: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యస్థల్లో భారతీయ రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. రైల్వేను భారతదేశ జీవనాడిగా పిలుస్తారు. ప్రజల ప్రయాణా వ్యయాన్ని తగ్గించేందుకు ప్రతి టికెట్ పై సుమారు సగం సబ్సిడీ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే, రైల్వే కేంద్రంగా అనధికార టికెట్ల అమ్మకం, దొంగతనాలు, మానవ అక్రమ రవాణా లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ప్రయాణీకులు సురక్షితంగా తమ గమ్యస్థానానాలకు చేరుకోవాలంటే ఇలాంటి ఘటనలను గమనించిన వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాలి. ఇలాంటి విషయాల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి సంబంధిత అధికారులు ప్రత్యేక బహుమతులు కూడా అందిస్తారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి ఎలా సమాచారం ఇవ్వాలి?
రైల్వే ప్రయాణీకులు జర్నీ సమయంలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించినట్లు అయితే, ఎవరికి? ఎలా నివేదించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ రైల్వే హెల్ప్ లైన్: ఏదైనా అనుమానాస్పద, చట్టవిరుద్ధ కార్యకలాపాలను రైల్లో గుర్తించినట్లైతే ప్రయాణీకులు ఇండియన్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కు కాల్ చేసి చెప్పవచ్చు.
⦿ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హెల్ప్ లైన్: రైల్వే భద్రతకు సంబంధించిన 182 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించవచ్చు.
⦿ సహ్యాత్రి యాప్: ఈ యాప్ ద్వారా ఆన్ లైన్ లో RPF కు క్రిమినల్ సంబంధిత ఫిర్యాదులను నమోదు చేసే అవకాశం ఉంటుంది.
⦿ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు: అధికారిక రైల్వే హ్యాండిల్స్ కు ట్యాగ్ చేయడం ద్వారా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
⦿ స్టేషన్ అధికారులు: చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను గమనించినట్లైతే నేరుగా స్టేషన్లలోని రైల్వే అధికారులకు సమాచారం అందించవచ్చు.
సమాచారం అందిస్తే బహుమతులు ఇస్తారా?
చట్టవిరుద్ధ కార్యకలాపాలను గురించి సమాచారం అందించినందుకు గాను, భారతీయ రైల్వే సంస్థ ప్రత్యక్షంగా బహుమతులు అందించడం లేదు. కానీ, ప్రయాణీకులను బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించడానికి ప్రోత్సహిస్తున్నది. తీవ్రమైన నేరాల నివారణకు దారితీసే విషయాలకు సంబంధించి ముందుగానే సమాచారం అందిస్తే, అవార్డులు అందించే అవకాశం ఉంటుంది.
⦿ గతంలో ఓసారి రైలులో అపరిశుభ్రమైన పరిస్థితుల గురించి ఫిర్యాదు చేసిన ఓ ప్రయాణీకుడికి రైల్వే అధికారులు రూ. 30,000 చెల్లించాల్సి వచ్చింది.
⦿ తాను రిజర్వు చేసుకున్న సీటులో మరొకరు వచ్చి కూర్చోవడంపై ఫిర్యాదు చేసిన ప్రయాణీకుడికి రూ. 75,000 పరిహారం లభించింది. ఈ పరిహారాలు అన్నీ వినియోగదారుల ఫోరమ్ ఆదేశాల ద్వారా లభించాయి.
అధికారులకు ఎందుకు చెప్పాలంటే?
ప్రైజ్ మనీ ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. చట్టవిరుద్ధ కార్యకలాపాలను గమనిస్తే, సంబంధిత అధికారులు చెప్పడం పౌరులుగా తమ బాధ్యత అని గుర్తించాలి. ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడం కోసం ఈ విషయాలను సంబంధిత అధికారులకు వెల్లడించాలి. మానవ అక్రమ రవాణా, దొంగతనం వంటి నేరాలను నిరోధించడానికి సమాచారం అందించాలి. శాంతిభద్రతలను కాపాడటంలో అధికారులకు సాయం చేయాలి.
Read Also: మనం రైలు కొనేయొచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్.. ఇండియాలో సాధ్యమేనా?