E-Paper
Advertisement

ఇంట్లో ఉండే వస్తువులతోనే.. సింక్‌ను కొత్తదానిలా మెరిపించండిలా

ఇంట్లో ఉండే వస్తువులతోనే.. సింక్‌ను కొత్తదానిలా మెరిపించండిలా
Advertisement

Kitchen sink cleaning tips: ఇల్లంతా ఎంత నీట్‌గా ఉంచుకున్నా.. కిచెన్ సింక్ కాస్త జిడ్డుగా, మురికిగా కనిపిస్తే చాలు, ఇల్లంతా మెస్సీగా అనిపిస్తుంది. తరచూ వంటపాత్రలు కడగడం వల్ల సింక్‌లో జిడ్డు, హార్డ్ వాటర్ మరకలు, బ్యాక్టీరియా పేరుకుపోతుంటాయి. వీటిని వదిలించడానికి గంటల తరబడి స్క్రబ్బర్‌తో రుద్దడం పెద్ద తలనొప్పి. కానీ.. ఎలాంటి హార్డ్ స్క్రబ్బింగ్ లేకుండా, మీ వంటింట్లో ఉండే సహజమైన వస్తువులతోనే.. సింక్‌ను జిగేల్‌మనిపించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కిచెన్ సింక్‌ను శ్రమ లేకుండా క్లీన్ చేయడానికి ఇక్కడ కొన్ని అద్భుతమైన, సేఫ్ పద్ధతులు ఉన్నాయి. ఇవి మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా కెమికల్స్ వాడాల్సిన అవసరం లేకుండా చేస్తాయి.

1. బేకింగ్ సోడా, వెనిగర్ మ్యాజిక్:

Advertisement

సింక్ అంతా కాస్త బేకింగ్ సోడా చల్లి, దానిపై వైట్ వెనిగర్ పోయండి. వెంటనే.. అది కెమికల్ రియాక్షన్ వల్ల నురగలా వస్తుంది. ఈ ప్రాసెస్ సింక్‌లోని జిడ్డును, దుర్వాసనను చిటికెలో వదిలిస్తుంది. ఐదు నిమిషాలు అలాగే.. వదిలేసి, ఆపై నీళ్లతో కడిగేయండి. బేకింగ్ సోడా సహజమైన క్లీన్సర్‌గా పనిచేస్తుందని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ పరిశోధనలు కూడా చెప్తున్నాయి.

2. హార్డ్ వాటర్ మరకలకు వెనిగర్:

మన దేశంలో చాలా ఇళ్లలో బోరు నీళ్ల వల్ల సింక్‌పై తెల్లటి గట్టి మరకలు పడుతుంటాయి. దీనికోసం వైట్ వెనిగర్‌లో ఒక కాటన్ క్లాత్‌ను పూర్తిగా నానబెట్టి, మరకలు ఉన్నచోట పరిచేయండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఆ క్లాత్ తీసి నార్మల్‌గా తుడిచేస్తే.. మరకలు మాయం. వెనిగర్ ఉపరితలంపై ఉండే బ్యాక్టీరియాను సమర్థవంతంగా చంపుతుందని ‘ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ హాస్పిటల్ ఎపిడెమియాలజీ’ స్టడీస్ నిరూపించాయి.

3. నిమ్మరసంతో మెరుపు:

Advertisement

ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి, సింక్ ఉపరితలంపై, రస్ట్ (తుప్పు) మరకలు ఉన్నచోట మెల్లగా రుద్దండి. నిమ్మకాయలోని.. సిట్రిక్ యాసిడ్ మొండి మరకలను ఈజీగా బ్రేక్ చేస్తుంది. పబ్-మెడ్ రీసెర్చ్ ప్రకారం, నిమ్మరసం హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేయడంలో బెస్ట్ యాంటీ-బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది.

4. డ్రెయిన్ హోల్ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్:

సింక్ లోపల పైప్ లేదా డ్రెయిన్ భాగం అత్యంత మురికిగా, ఇన్ఫెక్షన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. దీనికోసం 3 శాతం పీరియారిటీ ఉన్న కొద్దిగా ‘హైడ్రోజన్ పెరాక్సైడ్’ను డ్రెయిన్ హోల్‌లో పోసి, 10 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత వేడి నీళ్లతో ఫ్లష్ చేయండి. ఇది ఈ-కోలి, స్టెఫిలోకాకస్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలను పూర్తిగా తొలగిస్తుంది.

5. సహజమైన స్క్రబ్బర్ – ఉప్పు:

జిడ్డు ఎక్కువగా ఉన్న చోట లావు ఉప్పు చల్లండి. ఇది సింక్‌పై స్క్రాచెస్ (గీతలు) పడకుండా, జిడ్డును సాఫ్ట్‌గా వదిలిస్తుంది. ఉప్పుకు కొద్దిగా నిమ్మరసం కలిపి వాడితే రిజల్ట్ ఇంకా బాగుంటుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా కేవలం ఫ్రిక్షన్ ద్వారానే ఉప్పు మురికిని వదిలిస్తుందని సైన్స్ చెబుతోంది.

6. వారానికి రెండుసార్లు వేడి నీళ్లు:

పైపుల్లో పేరుకుపోయే ఆయిల్, జిడ్డును వదిలించడానికి వారానికి రెండు సార్లు వేడి నీళ్లను సింక్ హోల్‌లో పోయండి. ఇది అన్నిటికంటే సింపుల్ మెథడ్. వేడి నీళ్లు పైపుల్లో పేరుకున్న ఆర్గానిక్ వేస్ట్‌ను కరిగించి, బ్యాడ్ స్మెల్ రాకుండా చూస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పేర్కొంది.

7. కార్నర్స్ కోసం బేకింగ్ సోడా పేస్ట్:

టాప్స్ కింద, సింక్ అంచుల్లో మురికి నల్లగా పేరుకుపోతుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసి, ఆ మూలల్లో అప్లై చేయండి. ఐదు నిమిషాల తర్వాత తడి క్లాత్ తో తుడిచేస్తే చాలు, రుద్దే పనే లేదు. బేకింగ్ సోడా, వెనిగర్ కాంబినేషన్ ఫంగస్, మోల్డ్ (బూజు) పెరగకుండా మార్కెట్లో దొరికే లైజాల్ వంటి ప్రొడక్ట్స్‌లానే పనిచేస్తుందని ఓ స్టడీ వెల్లడించింది.

Tags

Related News

గంధపు చెట్ల మీదే పాములు ఎందుకు ఎక్కువగా నివసిస్తాయి? సువాసన కాదు.. అసలు కారణం ఇది

వర్షాకాలంలో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తీవ్రం.. ఇంట్లోనే ఈ డ్రింక్స్‌తో ఉపశమనం

చిన్నప్పుడు ఈ 5 అలవాట్లు ఉన్న పిల్లల్లు తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారిని పట్టించుకోరు

బరువు తగ్గాలంటే ఆకలితో ఉండాల్సిన పనిలేదు.. ఈ 4 పనులు చేయండి చాలు!

అన్న వద్ద డబ్బు గుంజడమే పని.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సోదరుల చేత ఖర్చు చేయించడంలో దిట్ట

ప్రతి రోజు మేకప్ తొలగించడానికి ఇబ్బందిపడుతున్నారా? నిమిషాల్లో మీ పని పూర్తి చేసే నేచురల్ క్లీన్సింగ్ బామ్ ఇలా చేసుకోండి

పిల్లలు తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతారు.. డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

స్వైన్ ఫ్లూ వస్తే పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×