E-Paper
Advertisement

కటింగ్ బోర్డును కేవలం నీటితో కడుగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!

కటింగ్ బోర్డును కేవలం నీటితో కడుగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!
Advertisement

Kitchen cutting board cleaning tips: ఇంట్లో.. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం.అందుకే మంచి కూరగాయలు తెచ్చి, శుభ్రంగా కడిగి వంట చేస్తాం. కానీ.. ఆ కూరగాయలను కట్ చేయడానికి వాడే ‘కటింగ్ బోర్డు’ఎంత వరకు పరిశుభ్రంగా ఉంటుందో.. ఎప్పుడైనా ఆలోచించారా? చాలా ఇళ్లలో.. కూరగాయలు,ఉల్లిపాయలు, పచ్చి మిర్చి లేదా నాన్ వెజ్ కోసిన.. తర్వాత బోర్డును నీళ్ల కింద.. పెట్టి పైపైన కడిగేసి వదిలేస్తుంటారు.ఈ చిన్న అలవాటు మీ కుటుంబాన్ని అనారోగ్యం పాలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కటింగ్ బోర్డుపై దాగున్న ప్రమాదకర బ్యాక్టీరియా:

మనం కటింగ్ బోర్డుపై కత్తితో కట్ చేసేటప్పుడు దానిపై.. చిన్న చిన్న గీతలు, పగుళ్లు ఏర్పడతాయి. మనం కేవలం నీటితో కడిగినప్పుడు, ఆ గీతల లోపల కూరగాయలు, మాంసానికి సంబంధించిన సూక్ష్మ భాగాలు అలాగే.. ఉండిపోతాయి. కాలక్రమేణా అక్కడ ఈకోలి , సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా వేగంగా.. వృద్ధి చెందుతాయి. తర్వాత సారి అదే బోర్డుపై పండ్లు లేదా కూరగాయలు కోసినప్పుడు ఆ బ్యాక్టీరియా నేరుగా మన కడుపులోకి వెళ్లి ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వాంతులు , విరేచనాల వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఉడెన్ vs ప్లాస్టిక్ బోర్డ్ – ఏది డేంజర్?

Advertisement

మార్కెట్లో చెక్కతో చేసినవి , ప్లాస్టిక్ లేదా గ్లాస్ కటింగ్ బోర్డులు అందుబాటులో.. ఉంటాయి. ప్లాస్టిక్ బోర్డులపై గీతలు చాలా త్వరగా పడతాయి. వాటిలో.. బ్యాక్టీరియా ఈజీగా చేరుకుంటుంది. ఇక చెక్క బోర్డులు చూడటానికి అందంగా ఉన్నప్పటికీ, వాటిలోని రంధ్రాలు తేమను పీల్చుకుంటాయి. సరిగ్గా ఆరబెట్టకపోతే .. చెక్క బోర్డులు బ్యాక్టీరియాకు నిలయంగా మారుతాయి. అందుకే వీటిని శుభ్రం చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

కటింగ్ బోర్డును సరిగ్గా శుభ్రం చేసే పద్ధతులు:

నిమ్మకాయ, ఉప్పు ట్రిక్:
ఉపయోగించిన బోర్డుపై .. కొద్దిగా ఉప్పు చల్లి,ఒక నిమ్మకాయ చెక్కతో బాగా రుద్దాలి. నిమ్మలోని ఆమ్ల గుణం, ఉప్పు కలిసి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి.

వెనిగర్, బేకింగ్ సోడా:

Advertisement

ఒక స్పూన్ బేకింగ్ సోడా.. వేసి దానిపై వైట్ వెనిగర్ చల్లాలి. కొద్ది సేపు బుడగలు వచ్చిన.. తర్వాత స్పాంజితో రుద్ది కడిగితే.. చెడు వాసన పోవడంతో పాటు క్రిములు నశిస్తాయి. ఇవి త్వరగా క్రిములను తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

Also Read: పిల్లలు హైట్ పెరగడం లేదా? రోజూ ఈ 5 యోగాసనాలు వేయండి.. ఆగకుండా ఎత్తు పెరుగుతారు

డిష్ సోప్, వేడి నీళ్లు:
ప్రతి సారి వాడిన తర్వాత.. డిష్ వాషింగ్ లిక్విడ్, వేడి నీటితో బోర్డును శుభ్రంగా కడిగి, ఎండలో లేదా గాలి తగిలే చోట నిటారుగా ఆరబెట్టాలి. తడి అలాగే ఉంటే బ్యాక్టీరియా పెరుగుతుంది.

ఇంట్లో ఉండే చిన్న చిన్న అజాగ్రత్తలే.. మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇప్పటి వరకు మీరు కటింగ్ బోర్డును కేవలం నీటితోనే కడుగుతుంటే.. ఇకపై ఆ అలవాటును మార్చుకోండి. సరైన పద్ధతిలో శుభ్రం.. చేసి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి!

Related News

వివాహ బంధంలో సమస్యలు.. విడాకుల పరిస్థితి నివారించడానికి 7 సూత్రాలు

స్టైలిష్‌గా కనిపించేందుకు బ్రాండెడ్ డ్రెస్‌ అవసరం లేదు.. తక్కువ బడ్జెట్‌లో ఫ్యాషన్ టిప్స్

“నాకు అదృష్టం లేదు”.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తమ వైఫల్యాలకు విధిని నిందిస్తారు

మీ వయసు పదేళ్లు తగ్గిపోతుంది.. నిత్యయవ్వన చర్మం కోసం ఈ 7 సూపర్ జ్యూస్‌లు తాగండి

డోపమైన్ కోసం డేటింగ్.. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న జెన్ జీ యువత

పిల్లలు హైట్ పెరగడం లేదా? రోజూ ఈ 5 యోగాసనాలు వేయండి.. ఆగకుండా ఎత్తు పెరుగుతారు

అసలు జ్ఞాన దంతాలతో ఉపయోగం ఉందా? వీటిని ఎప్పుడు తొలగించాలి

Big Stories

Advertisement
×