E-Paper
Advertisement

ఆ సినిమా చేసి తప్పు చేసాను.. సదా అవకాశాలు కోల్పోవడానికి అదే కారణమా?

ఆ సినిమా చేసి తప్పు చేసాను.. సదా అవకాశాలు కోల్పోవడానికి అదే కారణమా?
Advertisement

Actress Sada: వెళ్ళవయ్యా వెళ్ళు అనే డైలాగుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యారు నటి సదా (Sada). నితిన్ సదా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతూ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం (Jayam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సదా అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుసగా అవకాశాలను అందుకుంటూ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల సినిమాలకు దూరమయ్యారు. అప్పుడప్పుడు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

టార్చ్ లైట్ చేసి తప్పు చేశాను..

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా తన కెరియర్ గురించి అలాగే తనకు అవకాశాలు రాకపోవడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా తన సినీ కెరియర్ లోనే ఒక సినిమా చేయడం వల్ల చాలా రిగ్రేట్ గా ఫీల్ అవుతున్న విషయాన్ని కూడా బయటపెట్టారు. తమిళంలో “టార్చ్ లైట్” (Torch Light)అనే సినిమా చేయటం తన కెరీర్ లోనే చేసిన పెద్ద తప్పు అని తెలిపారు. నిజ జీవితంలో ఎంతో సిగ్గుపడతాను ఒక మహిళ జీవిత కథ చెప్పే సబ్జెక్టు కాబట్టి ఎంతో ధైర్యంగా అలాంటి బోల్డ్ పాత్రలో నటించాను. బోల్డ్ రోల్స్ చేయకూడదని నిబంధన పెట్టుకున్న తాను కథ కోసం అలాంటి రిస్క్ తీసుకున్నానని తెలిపారు.

సినిమా చూసి దారుణంగా తిట్టారు…

Advertisement

ఇలా ఈ సినిమా చూసిన తర్వాత తన పట్ల ఎంతోమంది విమర్శలు చేశారని దారుణంగా తిట్టారని సదా గుర్తు చేసుకున్నారు. ఒక ఆర్టిస్ట్ చేసిన పాత్రను చూడకుండా ప్రేక్షకులు సదా ఇలాంటి పాత్రలో ఎందుకు చేసిందని దారుణంగా తిట్టిపోతారు. నాలో మరో వేరియేషన్ చూపిద్దామనుకుంటే నాకు వచ్చిన నెగిటివిటీ చూసి చాలా షాక్ అయ్యానని ఈమె తెలిపారు. ఇక సినిమా అవకాశాలు రాకపోవడం గురించి కూడా ఈమె మాట్లాడుతూ.. తను ముంబైలో ఉండటం అలాగే సోషల్ మీడియాలో లేకపోవడం తనకు అవకాశాలు రాకపోవడానికి కారణమని తెలిపారు.

అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు..

ఇండస్ట్రీలో అవకాశం రావాలి అంటే పూర్తిగా మధ్య వ్యక్తుల పైన ఆధారపడవలసి ఉంటుంది. తన వద్దకు ఎలాంటి అవకాశాలు రాకుండా మధ్యలోనే కొంతమంది అడ్డుకున్నారని ఈమె సందేహాలను వ్యక్తపరిచారు. ఇటీవల నితిన్ నటించిన సినిమాలో రాను రాను అంటూ రీమేక్ సాంగ్ కోసం తనని సంప్రదించారంటూ వార్తలు వచ్చాయి కానీ అసలు ఇప్పటివరకు తనని ఎవరు ఈ విషయంపై అప్రోచ్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. సినిమాలకు ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్న “వెళ్ళవయ్యా వెళ్ళు” అనగానే ప్రేక్షకులు చూపించే ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. ఇక ఈమె బుల్లితెరపై ఢీ జడ్జిగా దాదాపు మూడు సంవత్సరాలు పాటు చేశారు. ఉన్నఫలంగా మానేయడానికి కారణం రొటీన్ గా అనిపించడంతోనే బ్రేక్ తీసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం ఈమె వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా తన లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

Advertisement

Also Read: ఐదేళ్ల తరువాత కూడా నిలబడే ఉన్నాను..చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న మెగా హీరో!

Related News

ప్యారడైజ్‌లో కేసీఆర్‌.. చూసి షాకవుతున్న ఆడియన్స్!

ఐదేళ్ల తరువాత కూడా నిలబడే ఉన్నాను..చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న మెగా హీరో!

సందీప్ మాటలను నిజం చేయాలనిపిస్తోంది – ఫరియా అబ్దుల్లా

‘ప్యారడైజ్’ ఎక్కడ తేడా కొట్టిందో తెలుసా?

నూతన బాధ్యతలు చేపట్టిన మెగా కోడలు ఉపాసన!

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

Big Stories

Advertisement
×