E-Paper
Advertisement

రూ.5వేల పెట్టుబడితో రూ.5 లక్షలు చేతికి ! సిప్ మ్యాజిక్ ఇదే

రూ.5వేల పెట్టుబడితో రూ.5 లక్షలు చేతికి ! సిప్ మ్యాజిక్ ఇదే
Advertisement

Power of compounding in mutual funds: ప్రస్తుత కాలంలో.. ఆర్థికంగా స్థిర పడాలని, భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో డబ్బు దాచుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ సంపాదనలో.. సగం ఖర్చులకే సరి పోతుంటే.. సేవింగ్స్ ఎలా సాధ్యం.. అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారి కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్  ఒక అద్భుతమైన వరంలా పని చేస్తోంది. పెద్దగా రిస్క్ లేకుండా.. నెలకు కేవలం రూ. 5,000 వంటి చిన్న మొత్తంతో.. కోట్లలో సంపాదించిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి మనం అనుకున్న రూ.5 లక్షల టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది? ఆ లెక్కలేంటో చూద్దాం.

కాంపౌండింగ్ పవర్:

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చక్రవడ్డీని ప్రపంచంలోని ఎనిమిదవ.. అద్భుతంగా అభివర్ణించారు. మ్యూచువల్ ఫండ్స్ విజయానికి అసలు రహస్యం ఇదే. మనం పెట్టే.. పెట్టుబడిపై వచ్చే లాభంపై మళ్లీ లాభం కలవడాన్ని కాంపౌండింగ్ అంటారు. మీరు నెలకు రూ.5,000 సిప్ ప్రారంభించినప్పుడు, మొదటి కొన్ని నెలలు లేదా సంవత్సరంలో ఆ గ్రోత్ పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఈ చక్రవడ్డీ పనితీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

రూ.5 లక్షల టార్గెట్ 

Advertisement

మ్యూచువల్ ఫండ్స్ సగటున వార్షిక రిటర్న్స్ దాదాపు 12% నుంచి 15% వరకు అందిస్తాయని డేటా చెబుతోంది. ఒక మోస్తరుగా 12% రిటర్న్స్ వస్తాయని అంచనా వేసుకుందాం.

మీరు నెలకు రూ. 5,000 చొప్పున ఏడాదికి రూ.60,000 మదుపు చేస్తారు. ఇలా కేవలం 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల (సరిగ్గా 42 నుంచి 45 నెలల) కాలంలో మీ మొత్తం పెట్టుబడి, దానిపై వచ్చే లాభం కలుపుకుని మీ చేతికి రూ.5 లక్షల టార్గెట్ సులభంగా చేరుకుంటుంది. అంటే, మీరు కేవలం రూ.2.1 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు మీ జేబు నుంచి పెట్టుబడి పెడితే, మిగతా మొత్తం కేవలం మార్కెట్ లాభాల రూపంలోనే యాడ్ అవుతుంది.

సిప్ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు:

మార్కెట్ హెచ్చుతగ్గులకు భయపడకూడదు:

Advertisement

స్టాక్ మార్కెట్ ఆధారిత ఫండ్స్ కాబట్టి రోజువారీ ఒడిదుడుకులు సహజం. మార్కెట్ పడిపోయినప్పుడు సిప్ ఆపడం చేయకూడదు. మార్కెట్ పడినప్పుడే మనకు ఎక్కువ యూనిట్లు వస్తాయి.

దీర్ఘకాలిక దృష్టి :

మీరు కేవలం 5 లక్షలతో ఆగిపోకుండా.. ఈ రూ.5000 సిప్‌ను అలాగే కొనసాగిస్తే.. ఇదే 10 లేదా 15 ఏళ్లలో కోట్లలోకి మారే అవకాశం ఉంది. క్రమశిక్షణ అనేది ఇక్కడ అత్యంత ముఖ్యం.

Also Read: ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఫండ్ రకం ఎంపిక:

మీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని.. బట్టి లార్జ్ క్యాప్, ఫ్లెక్సి క్యాప్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను నిపుణుల సలహాతో ఎంచుకోవడం మంచిది.

పెద్ద లక్ష్యాలు సాధించడానికి పెద్ద మొత్తాలు అవసరం లేదు. కేవలం చిన్న పొదుపు అలవాటు, సరైన సమయంలో సరైన చోట పెట్టే పెట్టుబడి ఉంటే చాలు. ఇప్పుడే మీ సిప్ జర్నీని స్టార్ట్ చేసి, మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన బాట వేసుకోండి!

Related News

కారణం లేకుండా కంపెనీ మిమ్మల్ని తీసేయొచ్చా? లేబర్ లా ప్రకారం ఉద్యోగులకు ఉండే పవర్ ఫుల్ రైట్స్!

కేంద్రంపై వర్తకుల తిరుగుబాటు.. అక్టోబర్ 2న క్యూఆర్ కోడ్స్ పని చేయవు! No UPI Day

స్టాక్ మార్కెట్ భారీ పతనం.. చివరిలో విదేశీ మదుపరులు అమ్మకాలు, అసలు కారణాలు ఇవే

ఆన్‌లైన్ షాపింగ్‌‌కు కొత్త రూల్స్, జనవరి ఒకటి నుంచి అమల్లోకి, ఎట్టి పరిస్థితుల్లోనూ

పండగ సీజన్‌ వేళ కేంద్రం శుభవార్త.. వంట నూనె ధరలకు ఊరట!

బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!

పిపిఎఫ్ vs సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి భవిష్యత్తు కోసం ఏ పథకం ఎక్కువ లాభదాయకం

Big Stories

Advertisement
×