BigTV English

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి ? లక్షణాలు ఎలా ఉంటాయి?

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి ? లక్షణాలు ఎలా ఉంటాయి?

Breast Cancer: మారుతున్న జీవనశైలి కారణంగా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధి విపరీతంగా విజృంభిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకర ప్రమాదం రోజురోజుకూ పెరిగిపోతుంది. అంతేకాదు 2022 అధ్యయనంలో జరిగిన లెక్కల ప్రకారం 28 శాతం మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారని చెబుతున్నారు. అంతేకాదు 30 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎదురవుతుందని తెలిపారు. అందువల్ల వీరు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల కలిగే లక్షణాలు ఏంటి, దానిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.


25 ఏళ్ల వయస్సు దాటిన యువతులు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాధి ఉన్న వారిలో రొమ్ము భాగంలో కణితి వంటిది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి నిపుణులు సూచించే అతిపెద్ద మార్గం సెల్ఫ్ టిడెక్షన్. అయితే ఈ కణితి దాదాపు 15 శాతం కణితుల్లో క్యాన్సర్ భయం ఉంటుందని చెబుతున్నారు. దీనిని త్వరగా గుర్తించినట్లయితే వైద్యలును సంప్రదించి చికిత్స తీసుకుంటే అరికట్టవచ్చని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురుకావడానికి ముఖ్య కారణం జీవనశైలి అని చెబుతున్నారు.

జీవనశైలిలో మార్పు కారణంగానే బ్రెస్ట్ క్యాన్సర్ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, రొమ్ము గడ్డలు చర్మం కింత ఏర్పడతాయి. చనుమొనల చుట్టూ ఇవి ముద్దల్లా తయారవుతాయి. అందువల్ల ఆ స్థలంలో మాంసపు ముద్దల్లా ఏదైనా కణితి కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే దాని గురించి వైద్యులకు సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఈ గడ్డలపై నొక్కినపుడు గట్టిగా కనిపిస్తుంది. మరోవైపు కణితి ఏర్పడిన స్థలంలో దురద, దద్దుర్లు కూడా వస్తాయి. చాలా అసౌకర్యంగా ఉంటుంది.


రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారికి కణితి వస్తుంది. దీని వల్ల దురద, దద్దుర్లు ఏర్పడతాయి. అంతేకాదు భుజం నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. తరచూ భుజం నొప్పిగా ఉండే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అంతేకాదు ఒక్కసారిగా రొమ్ములో ఏవైనా మార్పులు ఏర్పడితే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. పడుకున్నపుడు కూడా నొప్పిగా ఉండే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Makhana: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !

Stress: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Big Stories

×