Film Industry: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎంతోమంది హీరోయిన్లు స్పందిస్తూ.. ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా తాను ఎదురుకున్న ఇబ్బందుల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు అక్షర సింగ్ (Akshara Singh). భోజ్ పురి సినిమాలలోని అగ్ర నటీమణులలో ఒకరైన ఈమె.. తన నటనతో భోజ్ పురి చిత్ర పరిశ్రమలో మంచి పేరును సొంతం చేసుకుంది. ఇన్స్టా గ్రామ్ (Instagram) లో 6.7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఇకపోతే ఈమె భోజ్ పురి సినీ నటుడు పవన్ సింగ్ (Akshara Singh) తో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారు. దీంతో తీవ్ర మానసిక వేదనను భరించిన అక్షరాసింగ్.. పవన్ సింగ్ (Pawan Singh) పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే మళ్లీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భోజ్ పురి సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి, అలాగే తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే విషయాల గురించి కూడా తెలిపింది.
క్యాస్టింగ్ కౌచ్ పై అక్షరాసింగ్ కామెంట్..
ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షర సింగ్ మాట్లాడుతూ.. “ఒక్క సినిమా రంగమే కాదు ..ప్రతి రంగంలో కూడా ఆడవారిని దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతుంటే.. మీ ఇష్టం.. మీరు సినిమా రంగంలో రాజీ పడకూడదని నిర్ణయించుకుంటే, ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. కానీ చాలామంది రాజీ పడడాన్నే ఎంచుకుంటున్నారు. అయితే నా మదిలో ఒకటే ప్రశ్న తలెత్తుతుంది. కెరియర్లో ముందుకు వెళ్లాలి అంటే ఎందుకు రాజీ పడాలి? ప్రతి ఒక్కరికి ఒక ఎంపిక ఉంటుంది కదా.. రాజీ పడాలనుకునేవారు మాత్రమే అలా చేస్తారు. తమ సూత్రాలపై స్థిరంగా నిలబడాలనుకునే వారు మాత్రం రాజీపడరు”. అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్ చేసింది అక్షర సింగ్.
Nagarjuna: నాగార్జున అసలు పేరేంటి.. ఆయన గురించి తెలియని విషయాలివే?
నెలకు 20 సార్లు ప్రేమించాను – అక్షర సింగ్..
ఇంటర్వ్యూలో భాగంగా సినిమా రంగంలో రాజీ పడకపోతే అవకాశాలు రావట కదా? అని ప్రశ్నించగా.. అక్షర సింగ్ మాట్లాడుతూ..” ఇక్కడ రాజీ పడడం అనేది లేదు. ప్రత్యక్ష ప్రేమ మాత్రమే ఉంది. నేను ఒక వ్యక్తిని నెలకు 20 సార్లు ప్రేమించాను. కానీ విడిపోయాం .ఇప్పుడు ఆ నింద అబ్బాయిలపై కాదు అమ్మాయిలపైనే పడుతుంది. అమ్మాయిని అందరూ నిందిస్తారు. అమ్మాయిలు ఎంతో భావోద్వేగానికి లోనవుతారు. అందరూ ప్రేమించబడాలని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రేమలో పడిన అమ్మాయికి ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డుగా నిలుస్తారు.అమ్మాయి తప్పు లేకపోయినా అమ్మాయిలదే తప్పు అని చూపిస్తారు. దీంతో అమ్మాయి పడే వేదన ఎలా ఉంటుందో నాకు స్పష్టంగా తెలుసు” అంటూ పవన్ సింగ్ తో విడిపోయినప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా ఆమె తెలిపింది. మొత్తానికైతే మన నిర్ణయాలను స్థిరంగా ఉంచుకుంటే ఎవరు ఏమి చేయలేరని, ఎంతటి వారినైనా సరే డీ కొట్టే సామర్థ్యం ఆడవారిలో ఉండాలని కూడా అక్షరాసింగ్ తెలిపింది. ఇక ప్రస్తుతం అక్షరా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. కొంతమంది ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.