BigTV English

Pedicure: పార్లర్‌కు వెళ్లాల్సిన పనే లేదు, ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండిలా !

Pedicure: పార్లర్‌కు వెళ్లాల్సిన పనే లేదు, ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండిలా !

Pedicure: చాలా మంది ముఖ సౌందర్యంపై శ్రద్ధ చూపుతారు. కానీ కాళ్లు , చేతులు కూడా మీ అందాన్ని ప్రభావితం చేస్తాయి. వీటని పట్టించుకోకపోతే మీ అందం తగ్గడమే కాకుండా ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తుంటాయి. ఇదిలా ఉంటే పెడిక్యూర్ చేయడం వల్ల పాదాలు కోమలంగా తయారవుతాయి. అంతే కాకుండా వాటిపై ఉండే మురికి, దుమ్ము కూడా పూర్తిగా తొలగిపోతుంది.


మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పెడిక్యూర్ చేసుకోవడానికి మీరు పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సినవి:


ఒక పెద్ద గిన్నె లేదా టబ్
గోరువెచ్చని నీరు
ఎప్సమ్ సాల్ట్ లేదా ఉప్పు
లోషన్ లేదా మాయిశ్చరైజర్
నెయిల్ కట్టర్
ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ స్క్రబ్
టో సెపరేటర్

స్టెప్ -1 :
ఒక గిన్నెలో గోరు వెచ్చని నీటిని తీసుకుని దానిలో ఎప్సమ్ సాల్ట్ లేదా ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో మీ పాదాలను 10-15 నిమిషాలు నానబెట్టండి. ఇది మీ పాదాల చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, ఎప్సమ్ సాల్ట్ పాదాల నొప్పి , వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

స్టెప్ -2 :
మీ పాదాలను స్క్రబ్ చేయండి:
మీ పాదాలను తడిపిన తర్వాత వాటిని శుభ్రమైన టవల్‌తో తుడవండి. ఇప్పుడు ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ స్క్రబ్ ఉపయోగించి పాదాలపై ఉన్న మృత  కణాలను తొలగించండి. చీల మండలం , దిగువ కాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. దీని వల్ల పాదాల చర్మం మృదువుగా మారుతుంది.

స్టెప్ – 3

మీ పాదాలను రుద్దండి:
మీ గోళ్లను షేప్ చేయండి:
నెయిల్ కట్టర్ సహాయంతో గోళ్లను సరిగ్గా కత్తిరించండి. గోళ్లను చాలా చిన్నగా కత్తిరించకూడదు. ఎందుకంటే ఇది ఇన్గ్రోన్ కాలి గోళ్లకు దారితీస్తుంది. మీ గోళ్లను మృదువుగా, చక్కగా ఆకృతి చేయడానికి ట్రై చేయండి.

స్టెప్ – 4:
క్యూటికల్ కేర్:
పెడిక్యూర్ చేసేటప్పుడు, క్యూటికల్స్ కత్తిరించకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. మీ క్యూటికల్స్‌ను మృదువుగా చేయడానికి కొద్దిగా లోషన్ లేదా ఆలివ్ ఆయిల్ రాయండి. ఆ తరువాత క్యూటికల్ పుషర్ సహాయంతో వాటిని సున్నితంగా వెనక్కి నెట్టండి.

స్టెప్ – 5:
మీ పాదాలను తేమగా చేయండి:
పాదాలు, గోళ్లను తేమగా చేయండి. దీని కోసం మీరు ఏదైనా మంచి ఫుట్ క్రీమ్ లేదా లోషన్ ఉపయోగించండి. మాయిశ్చరైజర్ రాయడం వల్ల పాదాల చర్మం మృదువుగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది.

స్టెప్ – 6:

నెయిల్ పెయింట్ తొలగించండి:
పెడిక్యూర్ చేసే ముందు గోళ్లను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ గోళ్లను కత్తిరించి నెయిల్ పెయింట్ తొలగించండి. గోళ్లపై క్యూటికల్ క్రీమ్ రాసి కాటన్ తో శుభ్రం చేయండి.

స్టెప్- 7
నెయిల్ పేయింట్ :
పెడిక్యూర్ పూర్తయిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవడం గుర్తుంచుకోండి. పాదాలను పూర్తిగా ఆరనివ్వండి. ఇది పాలిష్‌ను బాగా సెట్ చేస్తుంది. అంతే కాకుండా పాదాలకు ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుంటున్నారా ? ఈ వ్యాధులు రావడం ఖాయం !

పెడిక్యూర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
నిజానికి, పెడిక్యూర్ పాదాల అందాన్ని పెంచుతుంది. పాదాలపై పేరుకుపోయిన మృత చర్మం తొలగిపోయి, పగిలిన మడమలు నయమవుతాయి. పెడిక్యూర్‌ను క్రమం తప్పకుండా చేయడం ద్వారా పాదాలు మెరుస్తాయి. దీంతో పాటు గోళ్ల మెరుపు కూడా పెరుగుతుంది. పెడిక్యూర్‌లో పాదాలను మసాజ్ చేస్తారు. ఇది శరీరానికి విశ్రాంతతనిస్తుంది. స్క్రబ్బింగ్ ద్వారా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×