Young Look Tips: ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతే కాకుండా తమ వయస్సు కంటే చిన్నగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ ముఖంలో అందాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్ని సార్లు ముడతలు, మచ్చల వంటి వాటిని లైట్ తీసుకుంటారు.
ఇదిలా ఉంటే ఏజ్ పెరుగుతున్నా కూడా యవ్వనంగా కనిపించడానికి రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కొన్ని సార్లు ఎన్ని చేసినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ పాటించడం వల్ల ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించవచ్చు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖాన్ని ఎప్పుడు, ఎలా శుభ్రపరచాలి ?
స్కిన్ కేర్‌లో ముఖాన్ని శుభ్రపరచడం అత్యంత ముఖ్యమైన దశ. తరచుగా ముఖం శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. రాత్రిపూట క్లెన్సింగ్ చేయడం అవసరం. దీనివల్ల చర్మంపై ఉన్న మురికి, మలినాలు తొలగిపోతాయి. మీరు మీ చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే.. అది మీ చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ పొరపాటు చేయడం వల్ల బమీ చర్మంపై త్వరగా ముడతలు రావడం ప్రారంభం అవుతుంది.
మాయిశ్చరైజర్ :
చాలా మంది ముఖ చర్మంపై మాయిశ్చరైజర్ అప్లై చేయడానికి ఇష్టపడరు. కానీ ప్రతి ఒక్కరూ మాయిశ్చరైజర్ వాడటం ముఖ్యం. మీ చర్మ రకం ఏదైనా, మీరు ఖచ్చితంగా ప్రతిరోజూ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది చర్మంలోని తేమను లాక్ చేస్తుంది. అంతే కాకుండా ఫైన్ లైన్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అందుకే దీనిని తరచుగా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
సన్‌స్క్రీన్ :
సన్‌స్క్రీన్ వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సన్ స్క్రీన్ వాడటం అలవాటు చేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ వాడాలి. ప్రతి సీజన్‌లో సన్‌స్క్రీన్ రాసుకోవాలి. సూర్యుని హానికరమైన కిరణాలు చర్మాన్ని చిన్న ఏజ్ లోనే వృద్ధాప్యం వచ్చేలా చేస్తాయి. అంతే కాకుండా ఇవి చర్మాన్ని త్వరగా దెబ్బతీస్తాయి. అందుకే యవ్వనంగా కనిపించడానికి సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా అప్లై చేయాలి.
Also Read: ముల్తానీ మిట్టిని తరచుగా ముఖానికి అప్లై చేస్తే.. ?
యవ్వనంగా కనిపించాలంటే ఇలా చేయండి:
ఈ 3 స్కిన్ కేర్ టిప్స్‌తో పాటు.. యవ్వనంగా కనిపించడంలో సహాయపడే మరో రహస్య ఉపాయం కూడా ఉంది. వారానికి ఒకసారి ఏదైనా మంచి ఫేస్ ప్యాక్ వాడటం మంచిది. శనగపిండి, పెరుగు, ముల్తానీ మిట్టి, పసుపుతో పాటు కొన్ని రకాల పదార్థాలను తయారు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి నేచరల్ గ్లో కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా చర్మంపై ఉన్న మృత చర్మ కణాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా.. ముఖానికి అదనపు మెరుపును కూడా తెస్తుంది. చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా యవ్వనంగా మారుస్తుంది.