IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )… మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతుంది. మార్చి 22వ తేదీ నుంచి.. మే 25వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… మొదటగా డిపెండింగ్ ఛాంపియన్స్… కోల్కత్తా నైట్ రైడర్స్, వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Kolkata Knight Riders vs Royal Challengers Bangalore ) మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read: Chahal Dhanashree Divorce: చాహల్-ధనశ్రీ విడాకులలో ట్విస్ట్.. అప్పుడే మంట మొదలైంది..?
అయితే ఈ మొదటి మ్యాచ్ నేపథ్యంలో… అందరి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధిస్తుందని కొంతమంది అంటుంటే… కాదు కాదు కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం సాధిస్తుందని మరికొంతమంది వాదిస్తున్నారు. అయితే తాజాగా…. ఇదే మ్యాచ్ పైన చిలుక జోష్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రెండు జట్లలో… కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం సాధిస్తుందని… ఓ ప్రముఖ జ్యోతిష్యుడు పేర్కొన్నాడు.
అది కూడా చిలుక జోష్యం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ జోష్యం ప్రకారం… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోయి.. కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం సాధిస్తుందని తేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే జోష్యం గురించి పక్కకు పెడితే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ బలాబలాలు పరిశీలించినప్పటికీ.. కేకేఆర్ చాలా బలంగా ఉంది.
గత సీజన్లో ఛాంపియన్ గా నిలిచిన సత్తా కోల్కత్తా నైట్ రైడర్స్ సొంతం అన్న సంగతి తెలిసిందే. అలాంటి జట్టు ఈసారి మరింత విజృంభించి ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే మైనస్ పాయింట్ ఏంటంటే… కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టులో శ్రేయస్ అయ్యర్ లేకపోవడం ఒక్కటే సమస్య. శ్రేయస్ అయ్యర్ ఆ జట్టులో ఉంటే… కేకేఆర్ మరింత బలంగా ఉండేది. అది మినహా మిగతా ప్లేయర్ లందరూ అత్యంత ప్రమాదకరంగా ఉన్నారు.
Also Read: Shardul Thakur LSG: శార్దూల్ కు అదిరిపోయే ఆఫర్.. లక్నో కీలక ప్రకటన ?
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే… గతంలో కంటే చాలా మెరుగ్గా ఆర్ సి బి కనిపిస్తోంది. కానీ ఈసారి కెప్టెన్ డుప్లిసిస్ లేడు. అతని ఈసారి కొనుగోలు చేయలేదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. రజత్ పాటిదార్ కు బాధ్యతలు అప్పగించారు. విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎప్పుడు ఆడుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">