Clove Oil For Hair: ఈ రోజుల్లో జుట్టు రాలడం అనే సమస్య సర్వసాధారణమైపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, కాలుష్యం కారణంగా.. జుట్టు బలహీనంగా మారి రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని చెప్పుకునే అనేక హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
అందుకే ఇంట్లోనే కొన్ని రకాల హోం రెమెడీస్ తయారు చేసుకుని వాడటం మంచిది. ఇందుకోసం లవంగాల నూనె ఉపయోగించడం మంచిది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా కొత్త జుట్టు పెరగడానికి సహాయ పడుతుంది. లవంగం నూనెను ఎలా తయారు చేసి ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లవంగం నూనె:
లవంగం నూనె తయారు చేయడం చాలా సులభం. దీన్ని తయారు చేయడానికి మీకు లవంగాలు, కొబ్బరి నూనె మాత్రమే అవసరం అవుతాయి . ముందుగా, 8-10 లవంగాలను తీసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో అర కప్పు కొబ్బరి నూనె తీసుకుని వేడి చేయండి. తర్వాత ఇందులో లవంగాల పొడి వేసి కొన్ని నిమిషాలు మరిగించి.. తర్వాత గ్యాస్ ఆపివేయండి. నూనె చల్లబడిన తర్వాత.. దానిని వడకట్టి గాజు సీసాలో స్టోర్ చేయండి.
లవంగం నూనెను ఎలా ఉపయోగించాలి ?
ఈ నూనెను సరిగ్గా ఉపయోగించడం ద్వారా.. మీరు మార్కెట్ ఉత్పత్తుల కంటే ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. దీన్ని అప్లై చేయడానికి.. కొద్దిగా గోరువెచ్చని లవంగం నూనెను మీ వేళ్లతో తలకు మసాజ్ చేసి.. కనీసం 1 గంట పాటు ఉండనివ్వండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. మీకు కావాలంటే.. మీరు దీన్ని వారానికి 2-3 సార్లు కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా మారి ఒత్తుగా కనిపిస్తుంది.
లవంగం నూనె వల్ల కలిగే ప్రయోజనాలు:
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది: లవంగం నూనె తలకు పోషణనిచ్చి జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు చివర్లు విరగకుండా నిరోధిస్తుంది. జుట్టు రాలుతుంటే ఈ నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల సమస్య తగ్గుతుంది.
కొత్త జుట్టు పెరగడం: లవంగం నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల కొత్త జుట్టు త్వరగా పెరగడం ప్రారంభమవుతుంది.
తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది: ఈ లవంగం నూనె చుండ్రు , ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనివల్ల జుట్టు మూలాలకు సరైన పోషణ లభిస్తుంది.
Also Read: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఈ ఒక్కటే మార్గం
జుట్టును మెరిసేలా చేస్తుంది: లవంగం నూనె జుట్లు యొక్క సహజ తేమను కాపాడుతుంది. అంతే కాకుండా వాటికి సహజమైన మెరుపును ఇస్తుంది. మీ జుట్టు పొడిగా , నిర్జీవంగా అనిపిస్తే.. ఈ నూనెను ఉపయోగించడం వల్ల అది మృదువుగా, మెరిసేలా తయారవుతుంది.