Ginger Benefits: అల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆహార పదార్ధాల రుచిని మార్చడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆయుర్వేదంలో ఔషధాల తయారీకి కూడా దీనిని ఉపయోగిస్తారు.
అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని మీ ఆహారంలో తరచుగా చేర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. అంతే కాకుండా అల్లంతో తయారు చేసిన టీ అనేక శరీర సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో ప్రభావ వంతంగా పనిచేస్తుంది. అల్లం ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
అల్లం ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. ఇది కడుపును ఖాళీ చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా అజీర్ణం, అల్సర్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు అల్లంను తమ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఇది వారికి సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా అల్లం తినని వారితో పోలిస్తే అల్లం తినే వ్యక్తుల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
అల్లంలో జింజెరాల్ ఉంటుంది. అంతేకాకుండా అల్లం యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా దగ్గు, జ్వరాన్ని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు , ఫ్లూతో సంబంధం ఉన్న ఇతర లక్షణాలను కూడా తగ్గిస్తుంది.
పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం:
స్త్రీలు నెలసరి సమయంలో అనుభవించే నొప్పి ఒక సాధారణ లక్షణం. కానీ కొన్నిసార్లు అది చాలా పెరిగి భరించలేనిదిగా మారుతుంది. కానీ అల్లం ఈ భరించలేని నొప్పి నుండి ఉపశమనం కలిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. పీరియడ్స్ సమయంలో అల్లం తినడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభించడమే కాకుండా వాపు కూడా తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన చర్మం:
అల్లం దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా కొల్లాజెన్ విచ్ఛిన్నతను నెమ్మది చేస్తాయి. చర్మాన్ని యవ్వనంగా, మృదువుగా కనిపించేలా చేస్తాయి. అంతే కాకుండా క్రిమి నాశక లక్షణాలు మొటిమల లక్షణాలను మెరుగుపరుస్తాయి.
బరువు తగ్గించడంలో సహాయం:
బరువు తగ్గడంలో సమస్యలు ఉన్నవారికి అల్లం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. దీనిలో ఉండే లక్షణాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడతాయి, ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
గుండె జబ్బుల నుండి ఉపశమనం:
అల్లం రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీ ఆహారంలో అల్లంను క్రమం తప్పకుండా చేర్చుకోవడం ద్వారా.. మీరు గుండె జబ్బులు, గుండెపోటు , స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అంతే కాకుండా క్రమం తప్పకుండా అల్లం తినడం వల్ల రక్త ప్రసరణలో లిపిడ్ స్థాయి కూడా తగ్గుతుంది.
Also Read: రాత్రి పూట పదే పదే నిద్ర లేస్తున్నారా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే !
క్యాన్సర్ నివారణ:
క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో అల్లం కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ కారక కణాలతో పోరాడి వాటిని నివారిస్తాయి. అల్లం అపోప్టోసిస్‌కు కారణమవుతుంది. అంతే కాకుండా ఇది కణితులు , క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది చర్మ క్యాన్సర్ రాకుండా కూడా చాలా సహాయపడుతుంది. పెద్దప్రేగు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధిని నివారించాలనుకుంటే ఖచ్చితంగా అల్లం తినడం అలవాటు చేసుకోవాలి.