జింక్ లోపం అనేది పిల్లల్లో చాలా ప్రమాదకరమైనది. ఇది వారి పెరుగుదలను అడ్డుకుంటుంది. అలాగే పెద్దల్లో కూడా జింక్ లోపం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. జుట్టు పెళుసుగా మారడం, గోళ్లు విరిగిపోవడం, చర్మంపై దద్దుర్లు రావడం వంటివన్నీ కూడా జింకు లోపం వల్లే కలుగుతాయి. జింక్ తీవ్రంగా లోపిస్తే ఇంకా ఎన్నో సమస్యలు రావచ్చు.
వైద్యులు చెబుతున్న ప్రకారం జింక్ లోపం వల్ల రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. జీర్ణాశయంతర పేగులు కూడా సరిగా పనిచేయలేదు. విరేచనాలు అధికంగా అవుతాయి. పోషకాల శోషణ కూడా తగ్గుతుంది. దీనివల్ల శరీరం పోషకాహార లోపం బారిన పడుతుంది. జింక్ లోపం అనేది వ్యవస్థ పై ప్రభావాన్ని చూపిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మానసిక స్థితిలో మార్పులు వస్తున్నాయంటే జింక్ తగినంత తింటున్నారో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హార్మోన్ల సమతుల్యతకు కూడా జింక్ అవసరం. కాబట్టి పురుషులు స్త్రీలు ఇద్దరూ కచ్చితంగా జింక్ ఉన్న ఆహారాలను తినాలి. లేకుంటే సంతాన ఉత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జింక్ ప్రాధాన్యత చాలామందికి తెలియదు. దానివల్లే జింక్ ఉండే ఆహారాలు ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు. జింక్ లోపిస్తే శరీరం ఇన్ఫెక్షన్ల బారిన త్వరగా పడుతుంది. అదే జింక్ నిండుగా ఉంటే రోగ నిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్ లతో గట్టిగా పోరాడుతుంది. గాయాలను త్వరగా నయం అవుతాయి. జింక్ లేకపోతే శరీరం కుదేలవుతుంది. జింక్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవలసిన అవసరం ఉంది.
మీకు తరచూ చర్మంపై దద్దుర్లు వచ్చి దురదలు పెడుతూ ఉంటే జింక్ లోపం ఉందేమో ఒకసారి పరీక్షించుకోండి. అలాగే జుట్టు పెళుసుగా మారి ఊడిపోతున్నా కూడా జింక్ లోపం ఉన్నట్టు భావించాలి. గోళ్లు చిన్న చిన్న ముక్కలుగా రాలిపోతున్నా కూడా జాగ్రత్తపడాలి.
జింక్ అధికంగా ఉండే ఆహారాలు ఏమిటో తెలుసుకొని వాటిని తినాల్సిన అవసరం ఉంది. మాంసం, చేపలు, సముద్ర ఆహారాలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిని వారానికి రెండు మూడు సార్లు తినేందుకు ప్రయత్నించండి. అలాగే కోడిగుడ్లు ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి. రోజుకో గుడ్డు తినడం వల్ల జింక్ లోపం చాలా వరకు రాదు. అలాగే పాల ఉత్పత్తుల్లో కూడా జింక్ అధికంగా ఉంటుంది.
Also Read: పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినాలా ? వద్దా ?
పిల్లలకు గ్లాస్ పాలు తాగించడం లేదా పెరుగన్నం తినిపించడం వంటివి చేస్తే వారిలో జింక్ లోపించకుండా ఉంటుంది. అలాగే చిక్కుళ్ళు జాతికి చెందిన ఆహారాలను కూడా అధికంగా తినాలి. వీటినే కాయ ధాన్యాలు అని అంటారు. కొమ్ము శనగలు, బఠానీలు వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రతిరోజు గుప్పెడు గుమ్మడికాయ గింజలు తినేందుకు ప్రయత్నించండి. ఇవి పుష్కలంగా జింక్ తో పాటు ఎన్నో పోషకాలను అందిస్తాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక తృణధాన్యాలను తినడం వల్ల కూడా ఎంతో ఆరోగ్యం వంటివి మీకు జింక్ లోపం రాకుండా అడ్డుకుంటాయి.