Pawan Kalyan – Allu Arjun: ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంతా చాలా అన్యూన్యంగా ఉండేది. కుటుంబంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అందరూ ఒక్కటైపోయేవారు. సినిమాల విషయంలో కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేవారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఈ మెగా ఫ్యామిలీలో భాగంగానే హీరోగా సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ గత కొన్నిరోజులుగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు దూరం చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా రాజకీయ విషయాల వల్లే వీరికి దూరాలు పెరిగాయని ప్రేక్షకులు అనుకుంటూ ఉన్నారు. అందుకే మెగా ఫ్యామిలీలో ఏ హీరో కూడా అల్లు అర్జున్‌ను కలవడం లేదు. కానీ ఇన్నాళ్ల తర్వాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. ఇదంతా ఒకడి వల్ల సాధ్యమయ్యింది.
ఇన్నాళ్లకు కలిశారు
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌కు రాజకీయాల్లో విభేదాలు మొదలయ్యాయి. అందుకే పవన్ గత ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా తనకు బన్నీ కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. మెగా ఇంట సంబరాలు జరుగుతున్న సమయంలో కూడా తను ఎక్కడా కనిపించలేదు. అప్పటినుండి ఇప్పటివరకు మెగా హీరోలతో అల్లు అర్జున్ ఎక్కడా కనిపించలేదు. అలాంటిది తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్లాడనే వార్త వైరల్ అయ్యింది. ఇన్నాళ్లకు వీరిద్దరూ బాగానే కలిశారే అని ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాదాపు సంవత్సరం నుండి మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు మాటలు లేకపోవడంతో ఈ వార్త.. మ్యూచువల్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది.
పరామర్శల కోసం
ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar)కు సింగపూర్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. తను చదువుకున్న స్కూల్‌లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో మార్క్ శంకర్ చేతికి, కాలికి గాయాలయ్యాయి. ఇప్పటికీ తనకు చికిత్స జరుగుతూనే ఉంది. అందుకే తన ఆరోగ్యం ఎలా ఉందా అని తెలుసుకోవడం కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్ సింగపూర్‌కు వెళ్లారు. తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఇండియాకు కూడా వచ్చారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కోసం అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇంటికి వెళ్లాడట. తనతో పాటు తన భార్య అల్లు స్నేహ కూడా ఉందని సమాచారం.
Also Read: తమన్నాపై పవన్‌కు యూట్యూబర్ అన్వేష్ ఫిర్యాదు.. ప్రాణాలు తీసేస్తున్నారంటూ..
ఫ్యాన్స్ హ్యాపీ
మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా తీయడం కోసమే అల్లు అర్జున్ (Allu Arjun), అల్లు స్నేహ తన ఇంటికి వెళ్లారని తెలుస్తోంది. మార్క్ శంకర్‌కు ఇలా జరగడం బాధాకరమే అయినా మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత తన వల్లే పవన్, బన్నీ మళ్లీ కలిశారని అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ చివరిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’లో కనిపించాడు. ఆ మూవీ దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషనల్ హిట్ అయినా, దాని వల్ల అల్లు అర్జున్‌కు ఎంత పాపులారిటీ లభించినా.. మెగా ఫ్యామిలీ నుండి ఒక్క హీరో కూడా ఈ సినిమా చూసి దీనిపై రివ్యూ ఇవ్వలేదు.