Fast Hair Growth: ఒత్తైన జుట్టు మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమకు పొడవాటి, ఒత్తైన జుట్టు ఉండాలని అనుకుంటారు. కానీ ప్రస్తుతం మన జీవనశైలి, పోషకాహార లోపంతో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు మన జుట్టును కూడా ప్రభావితం చేస్తాయి. జుట్టు రాలడానికి కారణం అవుతాయి. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే రసాయనాలతో తయారు చేసిన హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడటం కాకుండా హోం రెమెడీస్ ట్రై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇదిలా ఉంటే.. కలబంద, అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు. ఈ రెండు పదార్థాలు జుట్టు సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడతాయి. కలబంద వాడటం వల్ల తలకు చల్లదనం లభిస్తుంది. అంతేకాకుండా.. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. చుండ్రును కూడా తగ్గిస్తుంది. ఇదిలా ఉంటే.. అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E , ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును లోపల నుండి పోషిస్తాయి.
చాలా మంది కలబంద జెల్ జుట్టుకు వాడుతుంటారు. ఫ్లాక్ సీడ్స్ కూడా ట్రై చూస్తుంటారు. కానీ వీటిలో జుట్టుకు ఏది ఎక్కువగా ప్రయోజనాలను అందిస్తుంది ? రెండింటిని కలిపి జుట్టుకు వాడితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా ? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు అలోవెరా జెల్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు :
అలోవెరా జెల్ :
అలోవెరా జెల్ జుట్టుకు తేమను అందిస్తుంది. ఇందులో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. విటమిన్లు ఎ, సి , ఇ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. ఇవి కొత్త కణాలను సృష్టిస్తాయి . అంతే కాకుండా జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
ఇది తలపై పేరుకుపోయిన మృత చర్మాన్ని తొలగిస్తుంది.
కలబంద దురద, చుండ్రును తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు సహజమైన మెరుపును తెస్తుంది.
దీనిని లీవ్-ఇన్ కండిషనర్‌గా లేదా ప్రీ-హెయిర్ వాష్ ట్రీట్‌మెంట్‌గా కూడా ఉపయోగించవచ్చు.
అవిసె గింజల వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు ?
అవిసె గింజలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లం పుష్కలంగా లభిస్తుంది. ఇవి జుట్టు మూలాలను పోషించి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా, ఇందులో విటమిన్ ఇ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జుట్టును బలంగా , మెరిసేలా చేస్తుంది. అలాగే.. ఇది జుట్టుకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది.
అవిసె గింజలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు చివర్లు చిట్లిపోకుండా నిరోధిస్తాయి. ఫ్లాక్స్ సీడ్ జెల్ కూడా ఒక సహజమైన హెయిర్ స్టైలింగ్ జెల్ గా పనిచేస్తుంది.
Also Read: మోచేతులు నల్లగా మారాయా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతాయ్
అవిసె గింజలను ఎలా ఉపయోగించాలి ?
ముందుగా.. 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను కప్పు నీటిలో వేసి జెల్లీ లాగా అయ్యే వరకు మరిగించాలి. తర్వాత దీనిని వడకట్టండి. అనంతరం జుట్టుకు మాస్క్ లాగా అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.