E-Paper
Advertisement

ఫ్రిడ్జ్ డీఫ్రాస్ట్ చేయడానికి టెక్నీషియన్లు చెప్పే బెస్ట్ చిట్కా.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది!

ఫ్రిడ్జ్ డీఫ్రాస్ట్ చేయడానికి టెక్నీషియన్లు చెప్పే బెస్ట్ చిట్కా.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది!
Advertisement

Freezer Defrost Tips: ఫ్రిడ్జ్‌ను తరచూ తీసి వేస్తుంటే లేదా పాత మోడల్ డీప్‌ఫ్రీజర్లయితే లోపల కొండలా మంచు పేరుకుపోవడం సాధారణమే. ఇలా ఐస్ ఎక్కువగా గడ్డకడితే కరెంట్ బిల్లు బాదుడు పెరగడమే కాకుండా.. ఆహార పదార్థాలు కూడా పాడైపోతుంటాయి. అయితే ఈ మంచును వదిలించుకోవడానికి చాలామంది చేసే పొరపాట్లు ఫ్రిడ్జ్‌ను పూర్తిగా పాడుచేస్తాయి. అందుకే.. ఫ్రిడ్జ్‌లోని ఫ్రీజర్లో గడ్డకట్టుకుపోయిన మంచును ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా సులభంగా తొలగించివచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఆ తొందరపాటు పనులు వద్దు:

ఫ్రీజర్‌లో పేరుకుపోయిన మంచును చూసి ఓపిక లేక చాకులు, స్క్రూడ్రైవర్లు వంటి పదునైన వస్తువులతో గీకేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లోపల ఉండే కూలెంట్ పైపులు పగిలిపోతాయి. అలాగే సలసల కాగే వేడి నీళ్లను నేరుగా ఐస్‌పై పోస్తుంటారు. దీనివల్ల వేడికి ప్లాస్టిక్ ప్యానెళ్లు, డోర్ రబ్బర్లు దెబ్బతిని గాలి బయటకు పోతుంది.

Advertisement

Also Read: కలర్‌ఫుల్ నుంచి అద్భుతమైన ల్యాప్‌టాప్.. రైజెన్ 7 ప్రాసెసర్‌, 2.5K డిస్‌ప్లేతో అదరగొట్టే ఫీచర్లు!

సేఫ్ అండ్ ఈజీ ట్రిక్:

అప్లయన్స్ నిపుణులు దీనికి ఒక సులువైన మార్గం చెబుతున్నారు. ఫ్రిడ్జ్ ప్లగ్ తీసేసి, తలుపులు తీసి ఉంచి దానికి కాస్త దూరంలో ఒక చిన్న ఫ్యాన్ పెట్టి గాలి తగిలేలా చూడాలి. గాలి తిరగడం వల్ల ఐస్ వేగంగా కరగడం మొదలవుతుంది. ఆ తర్వాత గిన్నెల్లో గోరువెచ్చని నీటిని పోసి ఫ్రీజర్‌లో ఉంచి తలుపు మూసేయాలి. ఆ ఆవిరికి ఐస్ త్వరగా వదులైపోతుంది.

ఇలా చేస్తే పనైపోతుంది:

Advertisement

ఈ ఆవిరి వల్ల మంచు మెత్తబడ్డాక, ప్లాస్టిక్ స్పూన్ లేదా స్క్రాపర్‌తో సున్నితంగా తోస్తే చాలు, మంచు పొరలు సులభంగా ఊడివస్తాయి. ఈ ప్రక్రియ మొదలుపెట్టే ముందే ఫ్రిడ్జ్ చుట్టూ తువ్వాళ్లు పరుచుకుంటే కరిగిన నీరు ఇల్లంతా వ్యాపించకుండా ఉంటుంది. చాకులు, వేడినీళ్లు వాడకుండా ఈ చిన్న చిట్కాతో ఫ్రిడ్జ్‌కు ఏ హానీ జరగకుండా శ్రమ లేకుండా ఐస్‌ను తొలగించవచ్చు.

Also Read: శాంసంగ్ బిగ్ ప్లాన్.. భారత్‌లోకి ఓకేసారి 3 కొత్త ఫోన్లు ఎంట్రీ, ఫీచర్లు మాత్రం అదిరిపోయాయ్!

Related News

ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే టాయిలెట్ పేపర్ రోల్‌తో ఇలా చెక్ పెట్టండి!

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు విధితో పోరాడి విజయం సాధిస్తారు

తెల్ల జుట్టు ఆరోగ్యానికి మంచిదే.. ఆ ప్రమాదకర వ్యాధి నుంచి రక్షణకు సూచన

కర్రీలో నూనె ఎక్కువైందా? రుచి కాపాడడానికి ఈ 5 టిప్స్

రోజంతా పనిచేసి అలసిపోయారా? కేవలం 15 నిమిషాల్లో డిన్నర్ రెడీ చేసే 5 రెసిపీలు ఇవిగో

డైట్ సోడా తాగితే జ్ఞాపకశక్తి తగ్గుదల, త్వరగా వృద్ధాప్యం.. నిజమేనా?

భార్య మనసు గెలవాలనుకుంటున్నారా? భర్తల కోసం 5 సింపుల్ ట్రిక్స్

Big Stories

Advertisement
×