E-Paper
Advertisement

రాఖీ పండుగ రోజే చంద్రగ్రహణం.. ఆ సమయంలో రాఖీ కడితే ఏమవుతుంది?

రాఖీ పండుగ రోజే చంద్రగ్రహణం.. ఆ సమయంలో రాఖీ కడితే ఏమవుతుంది?
Advertisement

Raksha Bandhan 2026: అన్నాచెల్లెళ్ల అనురాగానికి, అక్కాతమ్ముళ్ల ప్రేమాభిమానాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షా బంధన్. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ వేడుకను ఎంతో వైభవంగా జరుపుకుంటాం. అయితే 2026లో రాఖీ పండుగ ఏ రోజున జరుపుకోవాలనే దానిపై చాలామందిలో ఒక చిన్నపాటి అయోమయం నెలకొంది. ఆగస్టు 27న చేయాలా లేక 28న జరుపుకోవాలా అనే సందేహాలకు పంచాంగకర్తలు స్పష్టత ఇచ్చారు.

పండుగ తేదీపై ఉన్న స్పష్టత..

హిందూ పంచాంగం ప్రకారం.. ఈసారి శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28వ తేదీ ఉదయం 9:48 గంటల వరకు ఉంటుంది. మన శాస్త్రాల ప్రకారం ఉదయ తిథికే ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి.. పండితులు ఆగస్టు 28నే రక్షా బంధన్ పండుగను జరుపుకోవాలని నిర్ణయించారు.

రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం..

Advertisement

పండుగ రోజున సోదరులకు రాఖీ కట్టడానికి ఉదయం సమయమే ఎంతో శ్రేష్ఠమైనది. ఆగస్టు 28న ఉదయం 6:23 గంటల నుంచి ఉదయం 9:48 గంటల వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన శుభ ముహూర్తం ఉంది. ఒకవేళ ఆ సమయంలో వీలు కాకపోతే.. మధ్యాహ్నం 12:14 గంటల నుంచి 1:05 గంటల వరకు ఉండే అభిజిత్ ముహూర్తంలో కూడా రాఖీలు కట్టుకోవచ్చు.

Also Read: కెమెరా హిస్టరీలోనే బిగ్ చేంజ్.. 68MP స్క్వేర్ సెల్ఫీ కెమెరాతో వస్తున్న కొత్త ఫోన్ ఇదే!

చంద్రగ్రహణం ప్రభావం ఎంతవరకు?

Advertisement

ఈ ఏడాది రక్షా బంధన్ రోజే కన్యా రాశిలో చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది. ఉదయం 8:04 గంటల నుంచి 11:22 గంటల వరకు ఈ గ్రహణ సమయం ఉంటుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి.. దీనికి ఎలాంటి సూతకం గానీ, దోషం గానీ వర్తించవు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా శుభ ముహూర్తంలో రాఖీ కట్టుకోవచ్చు.

పండుగ వెనుక ఉన్న పురాణ గాథలు..

రక్షా బంధన్ వెనుక అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. పూర్వం శ్రీకృష్ణుని వేలికి గాయమై రక్తం కారుతుంటే, ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టింది. దానికి మెచ్చిన కృష్ణుడు ఆమెకు ఆపద సమయంలో అండగా ఉంటానని మాట ఇచ్చి, ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమె మానాన్ని కాపాడాడు. అలాగే లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి, పాతాళంలో ఉన్న విష్ణుమూర్తిని వైకుంఠానికి తీసుకువెళ్లినట్లు కూడా చెబుతారు.

చరిత్రలో నిలిచిన సోదర బంధం..

పురాణాలే కాకుండా చరిత్రలోనూ రాఖీకి ప్రత్యేక స్థానం ఉంది. మేవార్ రాణి కర్ణావతి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి మొఘల్ చక్రవర్తి హుమాయూన్‌కు రాఖీ పంపి సాయం కోరింది. ఆ దారపు పొగును తోడబుట్టిన చెల్లి ప్రేమగా భావించిన హుమాయూన్, వెంటనే సైన్యంతో వచ్చి ఆమె రాజ్యాన్ని రక్షించడానికి ముందుకొచ్చాడు. అలా కాలాలు మారినా, రాఖీ బంధం ప్రాధాన్యత మాత్రం చెక్కుచెదరకుండా వస్తోంది.

Also Read: బ్లూటూత్ కాలింగ్, 140+ స్పోర్ట్స్ మోడ్స్.. షియోమీ నుంచి రూ.5,000కే అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!

Tags

Related News

బెడ్‌పై పిల్లలు మూత్రం పోశారా? మరకలు, దుర్వాసన తొలగించే సులభమైన చిట్కాలు ఇవే

బిజీ మార్నింగ్‌లో కూడా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కావాలా? 10 నిమిషాల్లో రెడీ చేసే రెసిపీలు ఇవే

భార్యభర్తలు ఇద్దరూ బిజీ.. దాంపత్య జీవితం సంతోషంగా సాగడానికి టిప్స్

నిర్మలా సీతారామన్ ఇంటి లోపల ఇలా ఉంటుందా?

ఆఫీస్‌లో తెలియక చేసే ఈ 5 తప్పులు కెరీర్‌ను దెబ్బతీస్తాయి.. జాగ్రత్త!

ఉదయాన్నే పిల్లలకు ఈ టిఫిన్స్ తినిపిస్తే రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు!

మటన్ చాప్స్ రోస్ట్ ఇలా చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ ఇదే కావాలంటారు!

చికెన్‌లో చింతపండు వేస్తే ఇంత టేస్టీగా ఉంటుందా? తప్పక ట్రై చేయండి!

Big Stories

Advertisement
×