Colorful Rimbook L1 Plus: కంప్యూటింగ్ మార్కెట్‌లోకి కొత్త ల్యాప్‌టాప్‌లు వరుసకడుతున్నాయి. ప్రముఖ టెక్ బ్రాండ్ ‘కలర్‌ఫుల్’ సరికొత్త Rimbook L1 Plusను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్టూడెంట్స్, ఆఫీస్ ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని.. ప్రీమియం మెటల్ డిజైన్‌తో దీనిని రూపొందించారు. ఇప్పుడీ Colorful Rimbook L1 Plus ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి.. వంటి వివరాల్లోకి వెళ్లిపోదాం..
ఈ ల్యాప్‌టాప్‌లో ప్రధాన ఆకర్షణ దీని స్క్రీన్. 16 అంగుళాల పెద్ద ఐపీఎస్ డిస్‌ప్లే, 2.5K రెజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల విజువల్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. అంతేకాకుండా.. 100 శాతం sRGB కలర్ గ్యామట్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి.. ఫొటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ చేసేవారికి కలర్స్ చాలా స్పష్టంగా, సహజంగా కనిపిస్తాయి.
Also Read: ఈ ఒక్క ఫీచర్ చాలు బ్రో.. Honor Band 11ను కళ్లు మూసుకొని కొనేయొచ్చు!
డైలీ టాస్క్‌లు, హెవీ వర్క్ లోడ్‌ను సులువుగా హ్యాండిల్ చేయడానికి ఇందులో ఏఎమ్‌డీ రైజెన్ 7 (AMD Ryzen 7 7735HS) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం ఏఎమ్‌డీ రేడియాన్ 680M ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇందులో 16GB LPDDR5 ర్యామ్, వేగవంతమైన 512GB PCIe Gen4 SSD స్టోరేజ్ అందించారు. ఇది విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
రోజంతా హాయిగా వాడుకోవడానికి ఇందులో 65Wh బ్యాటరీని ఇచ్చారు. దీనికి సరిపోయేలా 65W టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.2, టైప్-సి పోర్ట్‌ల వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంత పెద్ద స్క్రీన్ ఉన్నప్పటికీ, ఇది కేవలం 1.4 కేజీల బరువు, 16.65 మిమీ మందంతో చాలా తేలికగా ఉంటుంది.
ఈ ల్యాప్‌టాప్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ దీని ఫీచర్లను మాత్రమే వెల్లడించింది. ధర, అమ్మకాల తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రీజనబుల్ ప్రైస్‌లో వస్తే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారొచ్చు.
Also Read: వాట్సప్ యూజర్లకు ఊహించని సర్‌ప్రైజ్.. ఈ ఒక్క అప్‌డేట్‌తో సీన్ మొత్తం మారిపోయింది!