BigTV English

Tips For Summer: ఈ టిప్స్ పాటిస్తే.. ఏసీ లేకుండానే ఇల్లంతా కూల్.. కూల్

Tips For Summer: ఈ టిప్స్ పాటిస్తే.. ఏసీ లేకుండానే ఇల్లంతా కూల్.. కూల్

Tips For Summer: సమ్మర్‌లో పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంటి లోపలయినా బయటకు వెళ్లినా.. కూడా ఎండ కారణంగా సతమతం అవుతుంటారు. అంతే కాకుండా ఈ సీజన్‌లో ఇల్లు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటారు.


ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్న సమయంలో.. ఏసీ లేకుండా ఇంటిని చల్లగా ఉంచవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది. అవును, ఖచ్చితంగా.. ఉండొచ్చు. కొన్ని దేశీయ , సులభమైన టిప్స్ అవలంబించడం ద్వారా మీరు మీ ఇంటిని సమ్మర్ లో కూడా చల్లగా ఉంచుకోవచ్చు.

ఇంటి లోపల చిన్న మొక్కలను నాటండి:


మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా.. సహజ ఎయిర్ కండిషనర్లుగా కూడా పనిచేస్తాయి. కలబంద, మనీ ప్లాంట్ , తులసి వంటి మొక్కలు గది ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి గాలిని తాజాగా మార్చడమే కాకుండా తేమను కూడా తగ్గిస్తాయి. మీరు ఈ మొక్కలను కిటికీ, బాల్కనీ లేదా డ్రాయింగ్ రూమ్ దగ్గర పెంచుకోవచ్చు. ఇవి చాలా అందంగా కనిపిస్తాయి . అంతే కాకుండా వీటిని ఇంట్లో పెట్టడం ద్వారా మీ ఇల్లు కూడా చల్లగా ఉంటుంది.

కిటికీలకు తడి కర్టెన్లు వేయండి:
సూర్యకాంతి నేరుగా ఇంటి లోపలికి వచ్చినప్పుడు.. వేడి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు కిటికీలపై కాటన్ కర్టెన్లు వేసి వాటిని కొద్దిగా తడిగా ఉంచండి. గాలి కర్టెన్లను తాకిన వెంటనే.. అది చల్లబడి గదిలోకి ప్రవేశిస్తుంది. ఈ పద్ధతి మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తలపైకి ఉన్నప్పుడు చాలా ప్రభావవంతంగా ఉంటుంది.ఇది మంచి పద్ధతి అవుతుంది.

రోజుకు రెండుసార్లు నేలపై నీరు చల్లండి:
నేలపై నీరు చల్లడం వల్ల వేడి తగ్గి గది చల్లగా ఉంటుంది. మీరు దీన్ని ఉదయం , సాయంత్రం రెండుసార్లు చేయాలి. మీ ఇంట్లో టైల్స్ లేదా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటే ఈ పద్ధతి మరింత ప్రభావవంతంగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ పద్ధతి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Also Read: బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా ? అయితే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

పైకప్పు మీద నీరు చల్లండి:

మీరు పై అంతస్తులో నివసిస్తుంటే.. ఆ వేడి ప్రభావం నేరుగా ఇంటి లోపలికి కూడా చేరుతుంది. దీనిని నివారించడానికి.. పైకప్పుపై క్రమం తప్పకుండా నీటిని పిచికారీ చేయండి. ఉదయం , సాయంత్రం పైకప్పుపై నీరు చల్లడం వల్ల దాని వేడి తగ్గుతుంది. అంతే కాకుండా ఇల్లు లోపలి నుండి చల్లగా ఉంటుంది.

ఏసీ లేకపోయినా మీ ఇంటిని చల్లగా ఉంచుకోవాలనుకుంటే.. ఈ చిట్కాలను ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లు చల్లగా ఉంటుంది . మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిట్కాలను మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా వేసవి కాలాన్ని హాయిగా గడపవచ్చు.

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×