Brown Bread: మన జీవనశైలి మారుతున్న కొద్దీ, మన ఆహారపు అలవాట్లలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. వాటిలో కొన్ని మార్పులు మనకు మేలు చేసేవి అయితే చాలా వరకు హాని కలిగిస్తాయి. మారుతున్న జీవనశైలి కారణంగా.. మన ఆరోగ్యం కూడా చాలా వరకు ప్రభావితమవుతోంది.
ఆహారపు అలవాట్లలో మార్పుల గురించి చెప్పాలంటే.. గతంలో అన్నం, రోటీ లేదా చపాతీ, పప్పు-కూరగాయల వంటి రుచికరమైన ఆహారం తినే మనం ఇప్పుడు బ్రెడ్ , సలాడ్ వంటి వాటితో సరిపెట్టుకుంటున్నాం. ఇదిలా ఉంటే ఉదయం వంట చేయడానికి సమయం లేక చాలా మంది బ్రౌన్ బ్రెడ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తరచుగా బ్రౌన్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? మార్కెట్ లో ఎన్ని రకాల బ్రౌన్ బ్రెడ్ లు అందుబాటులో ఉన్నాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రౌన్ బ్రెడ్:
ఆరోగ్యకరమైన బ్రెడ్ గురించి మాట్లాడుకుంటే.. బ్రౌన్ బ్రెడ్ తెల్ల బ్రెడ్ కంటే ఆరోగ్యకరమైనవని చెబుతుంటారు. ఒక బ్రౌన్ బ్రెడ్ ముక్కలో ఉండే పోషకాలు:
కార్బోహైడ్రేట్లు – 23.6 గ్రాములు
ప్రోటీన్ – 3.9 గ్రాములు
ఫైబర్ – 2.8 గ్రాములు
మెగ్నీషియం – 37.3 మి.గ్రా.
కాల్షియం – 15.2 మి.గ్రా.
ఇనుము – 1.4 మి.గ్రా.
బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల కలిగే లాభాలు :
జీర్ణ వ్యవస్థ:
బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా మలబద్దకాన్ని నివారించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
బరువు తగ్గించడం:
బ్రౌన్ బ్రెడ్ బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారు బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయి:
ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదించేలా చేస్తుంది. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి షుగర్ ఉన్న వారు వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మల్టీగ్రెయిన్ బ్రెడ్:
శుద్ధి చేసిన పిండిని మల్టీగ్రెయిన్ బ్రెడ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బ్రెడ్ తినడం మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంతే కాకుండా మల్టీగ్రెయిన్ బ్రెడ్ ను అనేక ధాన్యాలను కలిపి తయారు చేస్తారు. ఈ బ్రెడ్‌లో విటమిన్ ఎ, బి, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి.
ఫ్రూట్ బ్రెడ్:
పిల్లలు ఫ్రూట్ బ్రెడ్ తినడానికి చాలా ఇష్టపడతారు. ఈ బ్రెడ్ తయారీలో ఎండుద్రాక్ష, ఖర్జూరం, ఇతర ఎండిన పండ్లను ఉపయోగిస్తారు. ఈ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది. అంతే కాకుండా ఇది రుచిగా కూడా ఉంటుంది.
Also Read: సపోటా తింటే.. శరీరంలో జరిగే మార్పులు ఇవే !
తేనె , ఓట్స్ బ్రెడ్:
ఈ బ్రెడ్‌ను దుకాణాల్లో ఎక్కువగా లభించదు. ఇది బేకరీలు, కేఫ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. తేనె , ఓట్స్ కలిపి తయారుచేసిన ఈ బ్రెడ్ తినడానికి రుచికరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
రై బ్రెడ్:
ఈ బ్రెడ్ తయారీకి రై , గోధుమ పిండిని ఉపయోగిస్తారు. ఈ బ్రెడ్‌లో అధిక ఫైబర్, తక్కువ కొవ్వు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నాయి. ఇది బ్రెడ్ తినడం వల్ల కూడా అనేక పోషకాలు శరీరానికి అందుతాయి.