Tips To Prevent Hair Fall: మారుతున్న వాతావరణం కారణంగా జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుంది. అంతే కాకుండా కాలుష్యం, పోషకాహార లోపంతో పాటు మరెన్నో కారణాల వల్ల జుట్టు రాలడం ఎక్కువవుతుంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ చర్మం, జుట్టును నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే సమ్మర్ లో జుట్టు రాలడం కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరి జుట్టు రాలకుండా ఉండేందుకు ఎలాంటి హోం రెమెడీస్ వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మెంతులు, కొబ్బరి నూనె:
కావాల్సినవి:
కొబ్బరి నూనె- 1 కప్పు
మెంతులు- 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా మందపాటి బౌల్ తీసుకుని అందులో ముందుగా చెప్పిన మోతాదులో కొబ్బరి నూనెను తీసుకుని గ్యాస్ పై వేడి చేయండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి, వాటిని రుబ్బుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మెంతుల పేస్ట్ కలిపి తలకు అప్లై చేయండి. తర్వాత తలకు మసాజ్ చేసి, 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలే సమస్యను ఎదుర్కునే వారు వీటిని వాడటం మంచిది.
ప్రయోజనాలు:
మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే గనక మీరు మెంతులు, కొబ్బరి నూనెను వాడటం మంచిది. నిజానికి, కొబ్బరి నూనె జుట్టుకు సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా మెంతులల్లో ఉండే పోషకాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి.
2. ఉసిరి, పెరుగు హెయిర్ మాస్క్:
కావాల్సినవి:
పెరుగు- 4 టేబుల్ స్పూన్లు
ఉసిరి పొడి- 2 టీస్పూన్లు
తయారీ విధానం:
పైన తెలిపిన మోతాదుల్లో పెరుగు, ఉసిరి పొడులను తీసుకుని మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను తలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచండి. తరువాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టుకు తగిన పోషణ లభిస్తుంది. ఉసిరి జుట్టుకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.ఇది జుట్టును మూలాల నుండి బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.
3. కలబంద, వేప పేస్ట్:
కావాల్సినవి:
కలబంద పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు
వేప ఆకుల పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
పైన తెలిపిన మోతాదులో కలబంద పేస్ట్‌తో పాటు వేప ఆకుల పేస్ట్ తీసుకుని మిక్స్ చేయండి. తర్వాత దీనిని జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాలు వదిలేయండి. తర్వాత షాంపూతో వాష్ చేయండి.
ప్రయోజనాలు:
కలబంద తలకు తేమను అందిస్తుంది. వేపలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఫలితంగా ఇదిచుండ్రును తొలగిస్తుంది. అంతే కాకుండా జుట్టును బలంగా కూడా చేస్తుంది.తరచుగా దీనిని వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి . జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఇవి అద్భుతంగా పని చేస్తాయి.
Also Read: వీళ్లు ఖర్జూరం అస్సలు తినకూడదు.. తెలుసా ?
ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. ఉల్లి రసం వాడటం వల్ల జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. దీనిని ఉపయోగించడానికి, ఉల్లిపాయను తురుము నుండి రసాన్ని తీయండి. దీన్ని జుట్టు మూలాలకు అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. చివరగా షాంపూతో జుట్టును వాష్ చేయండి.