BigTV English

Rekha Gupta Sleep Assembly : అసెంబ్లీ చర్చ సమయంలో నిద్రపోయిన కొత్త సిఎం.. కాదు కళ్లుమూసుకొని శ్రద్ధగా వింటున్నారని..

Rekha Gupta Sleep Assembly : అసెంబ్లీ చర్చ సమయంలో నిద్రపోయిన కొత్త సిఎం.. కాదు కళ్లుమూసుకొని శ్రద్ధగా వింటున్నారని..

Rekha Gupta Sleep Assembly | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ(బిజేపీ) నాయకురాలు రేఖా గుప్తాకు అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీ బిజేపీలో ఎంతో మంది సీనియర్ నాయకులున్నా.. వారందరినీ పక్కనబెట్టి బిజేపీ అధిష్ఠానం రేఖా గుప్తాకు సిఎం పదవి కట్టబెట్టారు. అయితే ఆమె పదవిలో కూర్చొన్న తొలిరోజు నుంచే ప్రధాన ప్రతిపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఆమెను టార్గెట్ చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించినట్లు ఆరోపణలు చేసింది. ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, అతిషీ మర్లేనా ట్విట్టర్‌లో ట్వీట్‌లు కూడా చేశారు. అయితే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి రేఖా గుప్తాను టార్గెట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది.


ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సమయంలోని 13 సెకన్ల వీడియోను షేర్ చేస్తూ.. “ఇక్కడ నిద్రపోతున్నది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఢిల్లీ ప్రజలు తమకు సేవ చేయాలని రేఖా గుప్తాను అసెంబ్లీకి పంపించారు. కానీ అసెంబ్లీ సమావేశం జరిగే సమయంలో ముఖ్యమంత్రి గారు నిద్రపోతున్నారు,” అని వ్యంగ్య వ్యాఖ్యానంతో ఆప్ పోస్ట్ పెట్టింది.

ఇంకా.. “ముఖ్యమంత్రి గారు అంబేద్కర్, భగత్ సింగ్‌ను అవమానించడం పూర్తై ఉంటే కొంత సమయం కేటాయించండి. దయచేసి అసెంబ్లీ చర్చలపై కూడా కొంచెం దృష్టి పెట్టండి,” అని ఆమ్ ఆద్మీ పార్టీ సిఎం రేఖా గుప్తాకు చురకలు అంటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేసిన వీడియోలో, రేఖా గుప్తా అసెంబ్లీలో కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్లు కనిపించే దృశ్యాలు కనిపిస్తున్నాయి.


అయితే.. ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేసిన ఈ వీడియోపై రేఖా గుప్తా అభిమానులు, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. “మా ముఖ్యమంత్రి అసెంబ్లీ చర్చలను కళ్ళు మూసుకుని శ్రద్ధగా వింటున్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ఆమ్ ఆద్మీ పార్టీ, కేవలం టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తోంది,” అని వారు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: దేశంలో ప్రజలందరికీ పెన్షన్.. కొత్త పథకం తీసుకురానున్న కేంద్రం

బిజేపీ దళిత వ్యతిరేక పార్టీ
ఇంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్‌ను రేఖా గుప్తా అవమానించారని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం.. స్వాతంత్ర్య సమరయోధులు అయిన అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలను తొలగించి, వాటి స్థానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ ఫోటోలను ఉంచినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషీ మర్లేనా.. ట్విట్టర్ ఎక్స్ వేదిక ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో.. తాము ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు ఉన్నాయని, కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆ ఫోటోలను తొలగించి, వాటి స్థానంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఫోటోలను పెట్టారని మాజీ సిఎం ఆతిషీ పేర్కొన్నారు.

ఈ విషయంపై అతిషీ మర్లేనా మీడియాతో మాట్లాడారు.. “బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ. ఇటీవలి ఘటనలు దీనికి సాక్ష్యం. మా పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలను ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ, దళిత వ్యతిరేక ఎజెండాతో ముందుకు సాగుతోంది. అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలను తొలగించడం ద్వారా దళితులను అవమానించడానికి ప్రయత్నిస్తోంది,” అని విమర్శలు చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి భయం పట్టుకుంది: బిజేపీ
ఈ ఆరోపణలకు స్పందిస్తూ, ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన కార్యాలయంలో అంబేద్కర్ , భగత్ సింగ్ ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయని సిఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. “ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో పెండింగ్‌లో ఉన్న 14 కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెడతాము,” అని ఆదివారం రేఖా గుప్తా ప్రకటించారు. ఈ ప్రకటనకు ఆమ్ ఆద్మీ పార్టీ భయపడిందని, ప్రజలను మభ్యపెట్టేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆమె మండిపడ్డారు. “మీరెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగి తీరుతుంది,” అని ఆమె స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రెసిడెంట్ ఫొటో పెట్టకూడదా?
“దేశ రాష్ట్రపతి ఫోటో పెట్టకూడదా? జాతిపిత మహాత్మా గాంధీ ఫోటో పెట్టకూడదా? భగత్ సింగ్, అంబేద్కర్ మన మార్గదర్శకులు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధిపతిగా, మేం వారి ఫోటోలను ఉంచేందుకు స్థలం కేటాయించాం. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం నా పని కాదు. నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటాను,” అని రేఖా గుప్తా స్పష్టం చేశారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×