BigTV English

Face Tightening Tips: ముఖంపై కొవ్వును తగ్గించే.. బెస్ట్ చిట్కాలు

Face Tightening Tips: ముఖంపై కొవ్వును తగ్గించే.. బెస్ట్ చిట్కాలు

Face Tightening Tips: వయసు పెరిగే కొద్దీ ముఖంపై వదులుగా, కొవ్వు పేరుకుపోతుంది. ముఖంపై కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా మంది ఖరీదైన క్రీమ్‌లు లేదా సర్జరీలను వాడుతుంటారు. కానీ ఇప్పుడు మీరు అలా చేయనవసరం లేదు. ఎందుకంటే సహజ చిట్కాల ద్వారా మీ చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా మార్చుకోవచ్చు. మీ ముఖంపై ఉన్న కొవ్వును పోగొట్టే అత్యంత ప్రభావవంతమైన , సులభమైన పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఆ టిప్స్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఫేస్ యోగా చేయండి:
ఫేస్ యోగా చేయడానికి ముఖం యొక్క రెండు మూలల్లో వేళ్లను ఉంచండి. తర్వాత నవ్వడానికి ప్రయత్నించండి. దీంతో కండరాలు సాగి చర్మం బిగుతుగా మారుతుంది.

మీకు వీలైనంత వరకు మీ బుగ్గలను బయటకు తీయండి. తర్వాత అలానే కొన్ని సెకన్ల పాటు పట్టుకోండి. ఆపై వదిలేయండి. ఈ వ్యాయామం ముఖ కండరాలను టోన్ చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. మెడ చర్మం బిగుతుగా ఉండాలంటే తలను ఒకసారి కుడివైపుకు, మరోసారి ఎడమవైపుకు తిప్పి పైకి కదిలి 10-15 సెకన్ల పాటు ఇలా ఉంచాలి.


ఐస్ క్యూబ్స్‌తో ముఖంపై మసాజ్:
ఐస్ క్యూబ్‌ను శుభ్రమైన గుడ్డలో చుట్టి, ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి.
ముఖంపై ఉన్న ప్రతి భాగానికి, ముఖ్యంగా బుగ్గలు , దిగువ మెడపై సున్నితంగా అప్లై చేయండి.

నీరు , గ్రీన్ టీ పుష్కలంగా త్రాగాలి:
రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక కప్పు గ్రీన్ టీ తాగండి. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపి, మీ చర్మానికి మెరుపునిస్తుంది.

ముఖ చర్మాన్ని బిగుతుగా మార్చుకోవడం అంత కష్టమైన పని కాదు. దీనికి కొంచెం శ్రద్ధ, క్రమబద్ధత అవసరం.ఫేస్ యోగా,ఐస్ క్యూబ్ మసాజ్,సరైన ఆర్ద్రీకరణతో,మీరు మీ చర్మాన్ని మళ్లీ యవ్వనంగా, బిగుతుగా మార్చుకోవచ్చు. మీరు తరచుగా హోం రెమెడీస్ ముఖానికి వాడటం వల్ల మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇవి మీ ముఖంపై ఉన్న అదనపు కొవ్వును కూడా తగ్గిస్తాయి.

Related News

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Symptoms In Legs: కాళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు !

Anti Aging Tips: వయస్సు పెరుగుతున్నా.. యవ్వనంగా కనిపించాలంటే ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో మాంసాహారం.. అక్కడి హిందువుల ప్రత్యేక వంటకం

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Big Stories

×