BigTV English
Advertisement

Imanvi: ప్రభాస్ మంచితనాన్ని తెలుసుకున్న ఇమాన్వి.. స్పెషల్ ఫోటో షేర్..

Imanvi: ప్రభాస్ మంచితనాన్ని తెలుసుకున్న ఇమాన్వి.. స్పెషల్ ఫోటో షేర్..

Imanvi: చాలావరకు హీరో, హీరోయిన్ల మధ్య ప్రొఫెషనల్ కనెక్షన్ మాత్రమే ఉంటుంది. చాలా తక్కువమంది హీరోహీరోయిన్లు మాత్రమే సినిమా అయిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ అవుతారు. అలా తనతో పనిచేసిన అందరి హీరోయిన్స్‌కు నచ్చేసే హీరోల్లో ప్రభాస్ ఒకడు. ప్రభాస్‌కు బయట ఎంత ఫ్యాన్ బేస్ ఉందో.. తనను ఇండస్ట్రీలో కూడా అంతేమంది ఇష్టపడతారు. తను ఎంత సింపుల్‌గా ఉంటాడో, ఎంత మంచివాడో పదేపదే చెప్తుంటాడు. ఇక ఒక హీరోయిన్ ప్రభాస్‌తో కలిసి నటించిందంటే చాలు.. కచ్చింతగా హోమ్ ఫుడ్‌ను టేస్ట్ చేయాల్సింది. ఇప్పటికి ప్రభాస్ హోమ్ ఫుడ్‌ను టేస్ట్ చేసి హీరోయిన్స్ లిస్ట్‌లో తాజాగా యంగ్ బ్యూటీ ఇమాన్వి కూడా యాడ్ అయ్యింది.


సెట్ నుండి ఫోటో

పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన తర్వాత ప్రభాస్.. ఒకేఒక్క ప్రేమకథలో నటించాడు. అదే ‘రాధే శ్యామ్’. కానీ ఆ ప్రేమకథ తనకు కలిసి రాలేదు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిశాస్టర్‌గా నిలిచింది. అయినా కూడా హను రాఘవపూడి దర్శకత్వంలో మరొక ప్రేమకథను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందమైన ప్రేమకథలను తన స్టైల్‌లో చెప్తూ ప్రేక్షకులను మెప్పించడంలో హను రాఘవపూడి స్పెషలిస్ట్. అందుకే ప్రభాస్‌తో తను తెరకెక్కించే లవ్ స్టోరీ కూడా బాగుంటుందిన ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు. ‘ఫౌజీ’ (Fauji) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా.. తాజాగా సెట్ నుండి ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసింది ఇమాన్వి.


డెబ్యూ హీరోయిన్

ప్రభాస్ సరసన నటించడానికి సీనియర్ హీరోయిన్స్‌నే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు మేకర్స్. కానీ హను రాఘవపూడి మాత్రం డిఫరెంట్‌గా ఆలోచించి అసలు యాక్టింగ్ అనుభవమే లేని ఒక అమ్మాయిని ‘ఫౌజీ’లో హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. తనే ఇమాన్వి. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా డ్యాన్స్ వీడియోలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉండేది ఇమాన్వి. అలాంటిది ఏకంగా ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. అందులో ఇమాన్వి కూడా జాయిన్ అయ్యింది. ప్రభాస్ ఇంటి నుండి వచ్చిన ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది ఇమాన్వి.

Also Read: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి గెలిచాను.. కెరీర్ విషయంలో పూజా హెగ్డే కామెంట్స్

థాంక్యూ ప్రభాస్

‘ఈ యమ్మీ ఫుడ్ అందిచినందుకు థాంక్యూ ప్రభాస్’ అంటూ ఫుడ్‌ను ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది ఇమాన్వి (Imanvi). దీంతో ప్రభాస్ మరొక హీరోయిన్‌కు కూడా తన హోమ్ ఫుడ్ టేస్ట్ తెలిసేలా చేశాడని నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన సెట్‌లో ‘ఫౌజీ’ షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ (Prabhas) ఇంకా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌లో జాయిన్ అవ్వలేదు. ప్రస్తుతం తను మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజులకే ఆ షూటింగ్ పూర్తవుతుంది. అప్పుడే ప్రభాస్ ఫోకస్ అంతా ‘ఫౌజీ’పైనే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×