BigTV English
Advertisement

Parashakthi : సూర్య వద్దు అనుకున్న స్టోరీతో శివ కార్తికేయన్… ‘పరాశక్తి’ని ఇంతమంది స్టార్స్ రిజెక్ట్ చేశారా..?

Parashakthi : సూర్య వద్దు అనుకున్న స్టోరీతో శివ కార్తికేయన్… ‘పరాశక్తి’ని ఇంతమంది స్టార్స్ రిజెక్ట్ చేశారా..?

Parashakthi : సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో వద్దనుకున్న మూవీని మరో స్టార్ చేయడం అనేది సాధారణమే. కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన తర్వాత క్యాన్సిల్ అవుతాయి. అలా సూర్య (Surya) రిజెక్ట్ చేసిన స్టోరీతోనే ఇప్పుడు కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ‘పరాశక్తి’ (Parashakthi) అనే సినిమాను చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి సూర్యతో పాటు ఈ మూవీని వదులుకున్న స్టార్స్ ఎవరెవరో తెలుసుకుందాం పదండి.


సూర్య రిజెక్ట్ చేసిన మూవీనే…

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమాను అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను నటీనటుల పేర్లతో రిలీజ్ కూడా చేశారు. కానీ మూవీని అనౌన్స్ చేసి ఐదు నెలలు పూర్తయినప్పటికీ, సినిమా పట్టాలెక్కకపోవడంతో క్యాన్సిల్ అయింది అనే రూమర్స్ మొదలయ్యాయి.


‘సూర్య 43’వ సినిమాను సుధా కొంగర దర్శకత్వంలో చేయబోతున్నారని 2023లోనే అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. అయితే దీనికి గల కారణం ఏంటి అన్న విషయం మాత్రం తెలియ రాలేదు. కానీ ఈ గ్యాప్ లో సూర్య ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ ఫ్లాప్ మూవీ కోసమే సుధా కొంగర మూవీని వదులుకున్నాడని టాక్ నడిచింది. ఎట్టకేలకు ఇదే ప్రాజెక్ట్ ని శివ కార్తికేయన్ చేపట్టాడని తెలుస్తోంది. తాజాగా ‘పరాశక్తి’ అనే టైటిల్ అనౌన్స్మెంట్ తో ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

‘పరాశక్తి’ని రిజెక్ట్ చేసిన స్టార్స్…

సుధా కొంగరతో ‘సూర్య 43’వ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడే ఇందులో పలువురు స్టార్స్ భాగం కాబోతున్నారని వెల్లడించారు. ఆ లిస్టులో సూర్యతోపాటు దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ, నజ్రియా తదితరులు ఉన్నారు. కారణం ఏంటో తెలియ రాలేదు గాని మొత్తానికి ఈ స్టార్స్ అందరూ ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. దీంతో తాజాగా కొత్త కాస్టింగ్ తో సుధా కొంగర ‘పరాశక్తి’ అనే టైటిల్ తో ప్రాజెక్టుని అనౌన్స్ చేసింది.

శివ కార్తికేయన్ కెరీర్ లో 25వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని డాన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, అధర్వ , జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో సూర్య చేయాల్సిన పాత్రని శివ కార్తికేయన్, నజ్రియా ప్లేస్ లో శ్రీ లీల, దుల్కర్ స్థానంలో జయం రవిని, విజయ్ వర్మ ప్లేస్ లో అథర్వని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ‘అమరన్’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న శివ కార్తికేయన్ ఈ మూవీతో ఎలాంటి హిట్టుని అందుకుంటాడు అన్నది చూడాలి. ఇక తాజాగా టైటిల్ అనౌన్స్మెంట్ ను చూసిన తర్వాత సూర్య ఈ ప్రాజెక్టుని అనవసరంగా వదిలేసుకున్నాడని రిగ్రేట్ అవుతున్నారు ఆయన అభిమానులు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×