Aloe Vera For Hair: సమ్మర్‌లో మన చర్మమే కాదు, జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు కూడా పెరగడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా తల చర్మంపై అధిక చెమట పట్టడం వల్ల, ధూళి దానిపై చిక్కుకుపోతుంది. ఇది బ్యాక్టీరియా ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుడా బ్యాక్టీరియా తలపై నెమ్మదిగా పెరగడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా దురద, ఇన్ఫెక్షన్, చుండ్రు ఎక్కువవుతాయి. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి, కలబంద, గోరింటతో తయారు చేసిన స్కాల్ప్ మాస్క్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది చల్లబరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. మీ స్కాల్ప్‌ను చల్లబరుస్తుంది. వేసవిలో, తలలో దురద, చికాకు వంటి సమస్యలు తరచుగా కనిపిస్తాయి. ఈ సమస్యలన్నింటికీ ఈ మాస్క్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పోషకాలు ,లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
జుట్టుకు హెన్నా, కలబందను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు :
హెన్నా తల చర్మాన్ని చల్లబరుస్తుంది. కలబంద దానికి లోతుగా తేమను అందిస్తుంది. హెన్నాలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కాల్ప్‌ను ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తలపై చర్మం జిడ్డుగా ఉండి, చుండ్రు ఎక్కువగా ఉన్న వ్యక్తులు దీని వల్ల జుట్టు సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు. హెన్నా జుట్టుకు సహజ రంగును ఇచ్చి మెరిసేలా చేస్తుంది.
కలబందను అప్లై చేయడం జుట్టుకు కుదుళ్లకు పోషణ లభిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. కలబందను వల్ల తలలో దురద , చికాకు నుండి ఉపశమనం లభిస్తుంది. హెన్నా , కలబందను కలిపి అప్లై చేయడం వల్ల సూర్యుని హానికరమైన కిరణాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఇది తలపై ఉన్న జుట్టును దెబ్బతీస్తుంది. అంతే కాకుండా ఈ హెయిర్ మాస్క్ తల చర్మానికి రక్షణ కల్పిస్తుంది.
హెన్నా, కలబంద హెయిర్ మాస్క్ :
ఈ మ్యాజిక్ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి.. ముందుగా ఒక పెద్ద గిన్నెలో చిన్న కప్పు హెన్నా పౌడర్ వేయండి. దీని తరువాత కలబంద కాస్త జెల్ తీసి బాగా హెన్నా పౌడర్ లో కలపండి. మీరు మార్కెట్ నుండి కొనుగోలు చేసిన కలబంద జెల్‌ను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం పెరుగు వేసి, వీటన్నింటినీ బాగా కలపండి. ఈ హెయిర్ మాస్క్ కొంచెం మందంగా ఉందని మీకు అనిపిస్తే, మీరు దానికి కొంచెం నీరు కలిపి మృదువైన హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు.
Also Read: ఇలా చేస్తే.. మెడపై ఉన్న నలుపు క్షణాల్లోనే మాయం !
ఈ హెయిర్ మాస్క్ వేసుకునే ముందు మీ జుట్టును వాష్ చేసి ఆరనివ్వండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ చేతుల సహాయంతో లేదా బ్రష్‌తో మీ జుట్టుకు అప్లై చేయండి. అనంతరం 30 నిమిషాల నుండి 1 గంట వరకు దానిని జుట్టు మీద ఉంచండి. ఇప్పుడు మీ జుట్టును సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. వెంటనే షాంపూ చేసే పొరపాటు చేయకుండా జాగ్రత్త వహించండి. మీరు చేయాల్సిందల్లా మీ జుట్టును సాధారణ నీటితో బాగా శుభ్రం చేసుకుని.. మరుసటి రోజు మీ జుట్టుకు షాంపూ చేయండి. ఇది మీ జుట్టుకు మంచి రంగును ఇస్తుంది. అంతే కాకుండా పోషణను కూడా అందిస్తుంది.