Neck Tanning: ముఖ చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి చాలా మంది వివిద రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ శరీరంలోని మరి కొన్ని భాగాలను అస్సలు పట్టించుకోరు. నిజానికి మెడ, మోచేతులు, మోకాళ్లతో పాటు ఇతర భాగాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల, మురికి పేరుకుపోతుంది. దీని కారణంగా అక్కడ జిడ్డు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే.. మెడ చుట్టూ నలుపు రంగు రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
అనారోగ్యకరమైన ఆహారాలు, తీవ్రమైన సూర్యకాంతి, కాలుష్యం మొదలైనవి కూడా ఇందుకు కారణాలు. మరి మెడపై ఉంటే నలుపును తొలగించడానికి ఎలాంటి హోం రెమెడీస్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శనగపిండి వాడండి:
శనగపిండిని ఉపయోగించడం ద్వారా మెడపై నల్లదనాన్ని తొలగించవచ్చు. దీని కోసం.. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక చెంచా శనగపిండి తీసుకోండి. తర్వాత దానికి పచ్చి పాలు, పసుపు కలిపి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని మెడ మీద అప్లై చేయండి. ఆరిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోండి. ఈ పేస్ట్ ని క్రమం తప్పకుండా వాడటం వల్ల మెడపై నలుపుదనం తొలగిపోతుంది. అంతే కాకుండా తెల్లగా తయారవుతుంది.
2. నిమ్మరసం రాయండి:
నిమ్మకాయలో విటమిన్ సి , ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ హోం రెమెడీ కోసం మీరు నిమ్మరసంలో రోజ్ వాటర్ కలిపి.. ఈ మిశ్రమాన్ని మెడపై అప్లై చేసి.. కొంత సమయం తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా తక్కుమ సమయంలోనే మీరు మెడపై ఉన్న నలుపుదన్నాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు.
3. దోసకాయ వాడండి:
మెడపై ఉన్న నలుపును తొలగించడానికి మీరు దోసకాయను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం.. దోసకాయను తురుము , నిమ్మరసం అవసరం అవుతాయి. ఈ హోం రెమెడీ తయారు చేయడానికి మీరు 1 టేబుల్ స్పూన్ దోసకాయ పేస్ట్‌లో టీ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత దీనిని మెడ మీద అప్లై చేసి, దాదాపు 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి.
4. కలబంద జెల్ :
కలబందలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించడం ద్వారా.. మీరు మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. ప్రతి రాత్రి అలోవెరా జెల్‌తో మీ మెడపై మసాజ్ చేసి.. మరుసటి రోజు నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే అద్భుత ఫలితాలు పొందవచ్చు.
5. బంగాళదుంప రసం:
మెడపై నలుపుదనం తొలగిపోవాలంటే.. ముందుగా బంగాళదుంపలను కడిగి పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత దానికి బియ్యం పిండి, రోజ్ వాటర్ కలపండి. బాగా బీట్ చేసి.. అనంతరం మెడ మీద అప్లై చేయండి. ఆరిపోయిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. తక్కువ సమయంలో మెడమీద ఉన్న నలుపుదనం పూర్తిగా తొలగిపోతుంది.
Also Read: రాత్రి పూట మొబైల్ చూస్తున్నారా ? ఈ వ్యాధులు రావడం ఖాయం
6. పెరుగు , పసుపు:
పెరుగు, పసుపు మిశ్రమం చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని కోసం.. ఒక గిన్నెలో రెండు చెంచాల పెరుగు తీసుకొని, అందులో పసుపు ,తేనెను కలపండి. ఇప్పుడు దానిని మెడ మీద అప్లై చేసి 15-10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది.