OTT Movie : ఓటిటిలో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భయపెట్టే సన్నివేశాలు ఉండటంతో వీటిని చూస్తూ బాగా థ్రిల్ అవుతున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు వస్తున్న హారర్ సినిమాలలో కామెడీ తో పాటు, ఇతర ఎలిమెంట్స్ ను కూడా జోడించి తెరకెక్కిస్తున్నారు మేకర్స్ . ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి వసూళ్లు కూడా సాధించింది. ఐఎండిబి లో 10 కి 9.2 రేటింగ్ గా కూడా ఉంది. రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడవచ్చు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఛూ మంతర్’ (Choo Mantar). 2025 జనవరి 10 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి నవనీత్ దర్శకత్వం వహించారు. ఇందులో శరణ్, చిక్కన్న, అదితి ప్రభుదేవ, మేఘన గావుంకర్, ప్రభు ముండ్కూర్, రజని భరద్వాజ్ వంటి నటులు నటించారు. ఈ సినిమా కథ ప్రధానంగా మోర్గాన్ హౌస్ అనే భయంకరమైన హాంటెడ్ మాన్షన్ చుట్టూ తిరుగుతుంది. ఇది అప్పట్లో బ్రిటిష్ కాలంలో జార్జ్ మోర్గాన్ అనే అధికారికి చెందినది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
గౌతమ్ డైనమో అనే మారుపేరుతో పిలవబడే ఒక పారానార్మల్ నిపుణుడు. తన సహచరులు అకాంక్ష, ఆర్జే , నకుల్ తో కలిసి ‘Choo Mantar’ అనే కంపెనీని నడుపుతుంటాడు. వారు నైనిటాల్‌లోని మోర్గాన్ హౌస్‌లో దాచబడిన ఒక రహస్య నిధిని కనిపెట్టేందుకు వెళతారు. ఈ హౌస్ గతంలో బ్రిటిష్ కలెక్టర్ జార్జ్ మోర్గాన్‌కు చెందినది గా ఉంటుంది. దీనికి భయంకరమైన చరిత్ర కలిగి ఉంది.ఇప్పటి వరకు అక్కడకు వెళ్ళినవారు తిరిగి రారని పుకార్లు చాలా ఉన్నాయి. 1945 లో మోర్గాన్ హౌస్ చీకటి గతం చాలా క్రూరంగా జరుగుతుంది. ఇక్కడ బ్రిటిష్ అధికారి గ్రామస్తులను పన్నులు వేస్తూ చాలా దోపిడీ చేస్తాడు. ఆ తరువాత 2004 లో ఒక దెయ్యాల వేటగాడు, ఈ హౌస్ రహస్యాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అతను తిరిగి రాదు. ఇప్పుడు డైనమో, అతని బృందం హౌస్‌లోని నిజాన్ని బయటపెట్టడానికి అడుగుపెడతారు. వారు హౌస్‌లోకి ప్రవేశించిన తర్వాత, వింత సంఘటనలు, భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. చివరికి ఆ హౌస్ రహస్యాలను డైనమో కనిపెడతాడా ? వీళ్ళు తిరిగి ప్రాణాలతో బయట పడతారా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హర్రర్ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా కామెడీ జోనర్ లో తెరకెక్కింది. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు.
Read Also : తిండికి గతిలేని బిలియనీర్ … కోట్లు ఉన్నా కటిక దరిద్రంలోనే … తండ్రి ఇచ్చే ట్విస్ట్ కి మతిపోవాల్సిందే