Pooja Hegde: ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ముకుంద సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో వరుణ్ తేజ సరసన నటించిన మంచి మార్కులను పొందుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం అనే సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించింది పూజ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత రంగస్థలం సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కనిపించింది.
అరవింద సమేత సినిమాతో బ్రేక్
అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అరవింద అనే పాత్రలో కనిపించింది పూజ. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత మళ్లీ హరీష్ దర్శకత్వంలో గద్దల కొండ గణేష్ అనే సినిమాను చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
అలవైకుంఠపురం సినిమాతో మరో బ్రేక్
2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అలవైకుంఠపురం సినిమా నాన్ బాహుబలి రికార్డులను అప్పట్లో క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటించింది పూజ. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. అఖిల్ కి కూడా ఇదే ఫస్ట్ హిట్ సినిమా అని చెప్పొచ్చు.
వరుస డిజాస్టర్ సినిమాలు
ఎన్నో అంచనాల మధ్య రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధిస్తుంది అని అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత విజయ్ సరసన చేసిన బీస్ట్ సినిమా కూడా డిజాస్టర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆచార్య సినిమా కూడా ఫెయిల్ అయింది. వరుసగా ఇన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడంతో, పూజను ఐరన్ లెగ్ అంటూ కొంతమంది ట్రోల్ మొదలుపెట్టారు.
మేకప్ లేకుండా రండి
ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో సినిమాలో నటించింది పూజా హెగ్డే. ఈ సినిమా కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజును కలిసినప్పుడు ఒక రిక్వెస్ట్ చేశాడట. ఈ సినిమా కోసం ఆమెను ఎటువంటి మేకప్ లేకుండా రమ్మని కార్తీక్ సుబ్బరాజు చెప్పారట. ఆ విషయం ఆమె కూడా మంచి సంతోషాన్ని ఇచ్చిందని ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తుంది పూజ హెగ్డే.
Also Read : OG Movie: పవన్ కళ్యాణ్ ‘ఓజీ ‘ కష్టమే.. మరోసారి వాయిదా..?