Amla For Hair Growth: నేటి బిజీ లైఫ్ స్టైల్‌తో పాటు చెడు ఆహారపు అలవాట్ల కారణంగా.. మన జుట్టు పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రతి ఒక్కరూ మందపాటి, ఉంగరాల జుట్టు ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే జుట్టు మన అందాన్ని పెంచుతుంది. కానీ నేటి కాలంలో జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే జుట్టుకు వివిధ రకాల రసాయనాలతో తయారు చేసిన హెయిర్ ప్రొడక్ట్స్ అప్లై చేసే బదులు.. హోం రెమెడీస్ వాడటం చాలా మంచిది. హోం రెమెడీస్ జుట్టును ఆరోగ్యంగా, బలంగా, పొడవుగా మార్చడంలో చాలా ప్రభావ వంతంగా పనిచేస్తాయి. వీటిని ఉపయోగించి జుట్టును సహజ పద్ధతిలో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఉసిరి వాడకం:
ఉసిరి మన ఆరోగ్యానికి.. జుట్టుకు అమృతంలా పనిచేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి పొడవుగా చేయడంలో సహాయపడుతుంది. ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలంగా చేస్తుంది. అంతే కాకుండా కొత్త పెరుగుదలను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఉసిరి జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. ఇది చుండ్రు, దురద, జుట్టు తెల్లబడటం, చివర్లు చిట్లడం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఉసిరి వాడటం వల్ల జుట్టుకు సహజమైన మెరుపు వస్తుంది.
పొడవాటి జుట్టు కోసం:
ఉసిరిని జుట్టుకు వాడటానికి హోం రెమెడీస్ అవసరం. ఇందుకు మీకు చాలా తక్కువ పదార్థాలు అవసరం అవుతాయి. దీని కోసం.. మీరు ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసం లేదా ఆమ్లా పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఒక పాత్రలో జుట్టుకు తగినంత ఉసిరి పొడి లేదా ఆమ్లా రసం వేసి గ్యాస్ మీద ఉంచి.. అందులో రెండు చెంచాల కొబ్బరి నూనె వేసి బాగా వేడి చేయండి. ఉడికిన తర్వాత.. వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
మీరు ఉసిరిని చిన్న ముక్కలుగా కోసి లేదా పొడిని నూనెతో కలిపి పాన్‌లో వేడి చేయడం ద్వారా కూడా దీనిని మీరు వేరే విధంగా ఉపయోగించవచ్చు.దీని తరువాత.. కరివేపాకు, మెంతులు వేసి 10 నుండి 15 నిమిషాలు తక్కువ మంట మీద వేడి చేయాలి. రంగు నల్లగా మారుతున్నట్లు మీకు అనిపించినప్పుడు.. మీరు దానిలో ఆముదం నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మీ జుట్టు పెరుగుదలను వేగంగా చేస్తుంది. నూనె చల్లబడటం ప్రారంభించినప్పుడు.. దానిని వడకట్టి గాలి చొరబడని సీసాలో నిల్వ చేయండి.
ఎలా అప్లై చేయాలి ?
నూనె కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు.. రాత్రి పడుకునే ముందు మీ వేళ్లతో జుట్టుకు మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే వదిలేయండి. ఇప్పుడు మరుసటి రోజు ఉదయం ఏదైనా హెర్బల్ షాంపూతో మీ జుట్టును శుభ్రం చేసుకోండి. ఈ హోం రెమెడీని వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు ఉపయోగిస్తే.. మీ జుట్టు రాలడం తగ్గి.. జుట్టు బాగా పెరుగుతుంది. కొన్ని నెలల్లోనే మీ జుట్టు బలంగా, పొడవుగా , మందంగా కనిపించడం ప్రారంభమవుతుంది.
Also Read: జుట్టు రాలుతోందా ? థైరాయిడ్ కావొచ్చు !
ఉసిరి తినడం:
మీరు ఉసిరిని మీ ఆహారంలో అనేక రూపాల్లో చేర్చుకోవచ్చు. జుట్టు పెరుగుదల కోసం.. ప్రతిరోజూ రెండు నుండి మూడు ఉసిరి పండ్లు తినండి. మీరు దీన్ని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. దీని కోసం.. ఒక గ్లాసు వేడి నీటిలో ఆమ్లా పొడిని కలిపి తాగాలి. ఉసిరి ఊరగాయ రుచికరంగా ఉండటమే కాకుండా.. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా మంచి ఎంపిక. దీంతో పాటు.. దీని నుండి తయారు చేసిన రసాన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.