Home Remedies For Dandruff: వేసవి కాలంలో.. చెమట, దుమ్ము, ఎండ నుండి ఉపశమనం పొందడం కష్టతరం అవుతుంది. అంతే కాకుండా తలపై చుండ్రు సమస్య కూడా వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. అధిక చెమట, ధూళి కారణంగా, ఫంగల్ ఇన్ఫెక్షన్ తలపై ప్రభావం చూపుతుంది. దురద, చికాకు, తెల్లటి పొర వంటివి జుట్టు సమస్యలను మరింత పెంచుతాయి.
చుండ్రు సమస్యనుండి బయటపడటానికి మార్కెట్లో లభించే యాంటీ-డాండ్రఫ్ షాంపూలు కూడా ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు ఇవి తక్షణ ఫలితాన్ని అందిస్తాయి. కానీ వేసవిలో తలకు చల్లదనం , పోషణ అందించడంలో హోం రెమెడీస్ చాలా ప్రభావ వంతంగా పనిచేస్తాయి. పెరుగు, వేప, వెనిగర్, కొబ్బరి నూనె వంటివి చుండ్రును దాని మూలాల నుండి తొలగించగలుగుతాయి. అంతే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా ఉంటాయి.
వేప ఆకుల పేస్ట్:
వేపలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రుకు ఔషధం కంటే తక్కువ కాదు. కొన్ని వేప ఆకులను తీసుకుని పేస్ట్ లాగా చేసి తలకు అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూతో కడిగేయండి. ఈ హోం రెమెడీ వారానికి రెండుసార్లు ఉపయోగించండి. ఇది చుండ్రును తొలగించడమే కాకుండా దురద, చికాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పెరుగు, నిమ్మకాయ మిశ్రమం:
పెరుగు తలకు తేమను అందిస్తుంది. నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. అర కప్పు పెరుగులో ఒక చెంచా నిమ్మరసం కలిపి తల మూలాలకు రాయండి. 20-25 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఈ రెమెడీ జుట్టు మూలాలను బలోపేతం చేయడంతో పాటు మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
కొబ్బరి నూనె, కర్పూరం వాడకం:
కొబ్బరి నూనె తలకు పోషణ అందిస్తుంది. కర్పూరం ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. రెండు చెంచాల కొబ్బరి నూనెలో చిటికెడు కర్పూరం కలిపి, కొద్దిగా వేడి చేసి.. తలకు మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయం షాంపూతో కడిగేయండి. క్రమం తప్పకుండా దీనిని వాడటం వల్ల చుండ్రు పోయి తలపై చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read: మోకాళ్ల వరకు జుట్టు పెరగాలా ? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆపిల్ సైడర్ వెనిగర్ తో స్కాల్ప్ వాష్ :
ఇది తలపై చర్మం యొక్క pH ని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా శిలీంధ్రాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఒక కప్పు నీటిలో రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి, షాంపూ చేసిన తర్వాత, తలకు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయండి. 5-10 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది తలపై చర్మాన్ని శుభ్రపరచడంలో చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది.