BigTV English

Prabhas: రాజాసాబ్ టీజర్.. ఏది ఇప్పుడు మాట్లాడండిరా ప్రభాస్ లుక్స్ గురించి

Prabhas: రాజాసాబ్ టీజర్.. ఏది ఇప్పుడు మాట్లాడండిరా ప్రభాస్ లుక్స్ గురించి

Prabhas:  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి రాజాసాబ్. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీవిశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టకోవడంతోపాటు భారీ అంచనాలను రేకెత్తించింది.కామెడీ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.


 

అన్ని బావుండి ఉంటే ఈపాటికి రాజా సాబ్ థియేటర్లో రిలీజ్ అయ్యి రెండు నెలలు దాటి ఉండేది. కాకపోతే హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విఎఫ్ఎక్స్ పనులు అవ్వకపోవడంతో ఈ సినిమాను డిసెంబర్ 5 కి వాయిదా వేశారు. ఈ సినిమా నుంచి ఎప్పుడెపుడు టీజర్ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి నేడు టీజర్ రిలీజ్ అవడంతో సంబురాలు జరుపుకుంటున్నారు. కేవలం టీజర్ రిలీజ్ కే థియేటర్లో రచ్చ రేపుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.  మొదట థియేటర్లోనే రాజాసాబ్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ మొబైల్స్ లో ఆ టీజర్ ను బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మొబైల్ టీజర్ నే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


 

టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించడంతోపాటు హర్రర్ తో గట్టిగానే భయపెట్టినట్లు తెలుస్తుంది. టీజర్ మొత్తంలో ప్రభాస్ లుక్ హైలెట్ గా నిలిచాయి. వింటేజ్ ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ లుక్ మీద చాలానే విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రెండేళ్ల క్రితం ఆదిపురుష్ సమయంలో ప్రభాస్ లుక్ గురించి ఎంత నీచంగా మాట్లాడారో అందరికీ తెల్సిందే. బాలీవుడ్ లో ప్రభాస్ ఫోటోలను మార్ఫ్ చేసి.. ఇతను రాముడు ఏంటి.. ? అని అవహేళన చేశారు.  ఆ సమయం నుంచి మొన్న ఈ మధ్య వచ్చిన కల్కి వరకు కూడా ప్రభాస్ లుక్స్ మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాగి తాగి ముఖం మీద ముడతలు వచ్చాయని, కళ్లు ఉబ్బాయని, బరువు పెరిగి అంకుల్ అయ్యాడని, జుట్టు కూడా విగ్ అని.. ఇలా రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు .. వాటన్నంటికీ డార్లింగ్ చెక్ పెట్టాడు.

 

రాజాసాబ్ సినిమాతో  విమర్శకులందరిని  గట్టి దెబ్బ కొట్టాడు ప్రభాస్ . రాజాసాబ్ టీజర్ లో ప్రభాస్ లుక్ వేరే లెవెల్ లో ఉంది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా సమయంలో ఉన్న లుక్ ను ఈ సినిమాలో దింపేశాడు.  ఎవరైతే ప్రభాస్ లుక్ గురించి నెగిటివ్ గా మాట్లాడారో.. ఇప్పుడు వారే ప్రభాస్ ఏంటి రా ఇంత అందంగా ఉన్నాడు అని  మాట్లాడుకొనేలా డార్లింగ్ కనిపించాడు. ఇదంతా మారుతీ వలనే అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా టీజర్ మొత్తం లో ఎక్కడ ప్రభాస్ లుక్ పై మళ్లీ విమర్శలు వస్తాయేమో అని భయపడిన ఫ్యాన్స్ కు ఆయన లుక్ చూసి ఔరా అనిపించేలా కామెంట్స్ రావడంతో ఏది ఇప్పుడు మాట్లాడండిరా ప్రభాస్ లుక్స్ గురించి అంటూ కామెంట్స్ పెడుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×