Srikanth Iyengar : శ్రీకాంత్ అయ్యంగర్… ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న ఆ మధ్య… సినీ జర్నలిస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి… అందరి చేత చీవాట్లు తెచ్చుకున్నాడు. తర్వాత జర్నలిస్ట్‌లకు సారీ చెప్పినా… శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పుడు కూడా వివాదాస్పద నటుడే అని అంటుంటారు అందరు. తాజాగా ఈయన ఓ ట్వీట్ చేశాడు. దీని పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొలిటికల్ అంశంగా ఉన్న ఈ ట్వీట్ వల్ల ఓ వర్గానికి దగ్గరైపోయాడు. ఇంతకి ఆ ట్వీట్ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్ధాం…
నిన్న ఏపీ రాజకీయాల్లో మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ… ‘కార్పొరేటర్‌కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ… జీవితంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు’ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ కామెంట్ చేశాడు.
జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అధికార కూటమికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు స్ట్రాంగ్‌గా స్పందిస్తున్నారు. మంత్రి లోకేష్ అయితే జగన్‌కు ధీటుగా రిప్లే ఇచ్చాడు. అలాగే మరో మంత్రి జనసేన నాయకుడు నాదేండ్ల మనోహర్ అయితే… ‘కోడి కత్తికి ఎక్కువ గొడ్డలి పోటుకు తక్కువ’ అంటూ మాజీ సీఎం జగన్‌ను ఎద్దేవ చేశాడు.
అలా…. నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ కూడా నెట్టింట్లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించాడు. ట్విట్టర్‌తో తన అధికారిక ఖాత అయిన శ్రీకాంత్ భారత్ నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో శ్రీకాంత్ అయ్యంగర్ అంకెల్‌ను అప్పగిస్తాను అంటూ… 1, 2, 3… లెక్కిస్తాడు. 11 వరకు వచ్చే సరికి చిరాకుగా ‘హే ఛీ… పక్కనబెట్టు’ అంటూ 11ని దాటేసి.. 12, 13 అంటూ కౌంట్ చేస్తాడు.
అయితే… గత ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వైసీపీని, వైఎస్ జగన్ ను 11 నెంబర్‌తో ట్రోల్స్ చేస్తున్న సంగతీ అందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల అనంతరం శ్రీకాంత్ అయ్యంగర్ ఈ 11 అంటూ ట్రోల్ చేయడంపై కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు… ఈ వీడియో వైరల్ చేస్తున్నారు.
ఏపీ ప్రజలకు వైఎస్ జగన్‌కి ఇచ్చిన స్థానం 11 అని.. అది జగన్ మర్చిపోయినట్టు ఉన్నాడని, ఆ విషయాన్ని నటుడు శ్రీకాంత్ అయ్యంగర్… ఇలా గుర్తు చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మాజీ సీఎం జగన్‌కి మంచి కౌంటర్ వేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
#11#number #numbergame pic.twitter.com/3hepN7ggAp
— Shrikanth BHARAT (@Shri__Bharat) March 5, 2025