Beauty Tips: పార్టీ లేదా ఫంక్షన్‌కి ముందు పార్లర్‌కి వెళ్ళడానికి మీకు సమయం లేకపోతే.. అస్సలు టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇంట్లో ఉండే 5 హోం రెమెడీస్ మీ చర్మానికి తక్షణ మెరుపును అందిస్తాయి. ఫలితంగా ఎలాంటి ఖర్చు లేకుండా మీరు గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.
ప్రతి మహిళ తన ముఖం ఎల్లప్పుడూ తాజాగా, ప్రకాశవంతంగా కనిపించాలని కోరుకుంటుంది. కానీ కొన్ని సార్లు సడన్‌గా ఫంక్షన్ లేదా పార్టీకి సిద్ధం కావడం కష్టం అవుతుంది. ముఖ్యంగా పార్లర్‌కు వెళ్లడానికి సమయం లేనప్పుడు. మీకు కూడా ఇలానే జరిగితే.. ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంట్లో 5 పదార్థాల సహాయంతో పార్లర్ గ్లో పొందవచ్చు. నిమిషాల్లోనే ఎక్కువ ఖర్చు లేకుండా తెల్లగా మెరిసిపోవచ్చు.
ఈ ఫేషియల్స్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా.. లోపలి నుండి పోషణను అందిస్తాయి. అంతే కాకుండా లోతుల నుండి శుభ్రపరుస్తాయి. ఇంట్లోనే పార్లర్ లాంటి మెరుపును ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చి పాలు:
పచ్చి పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చనిపోయిన చర్మాన్ని కూడా తొలగిస్తుంది. దీనిని కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేసి.. 5 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.
2.శనగపిండి, పసుపు:
శనగపిండిలో చిటికెడు పసుపు, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. అనంతరం చేతులతో ముఖం మీద అప్లై చేయండి. ఇది చర్మంలోని మలినాలను తొలగించి సహజమైన మెరుపును మీకు అందిస్తుంది.
3. టమాటో రసం:
టమాటో రసాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల టానింగ్ తొలగిపోయి చర్మపు రంగు సమంగా మారుతుంది. 10 నిమిషాలు దీనిని అప్లై చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా ముఖం తెల్లగా మెరిసిపోతుంది.
4. పెరుగు, తేనె:
పెరుగులో తేనె కలిపి మాస్క్ తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. అనంతరం 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్ గా, ప్రకాశవంతంగా మారుస్తుంది. అంతే కాకుండా తక్షణమే కాంతివంతమైన చర్మాన్ని మీకు అందిస్తుంది.
5. ఐస్ క్యూబ్స్ :
ఫేషియల్ చివరి దశలో.. ఐస్ క్యూబ్‌ను ఒక క్లాత్‌లో చుట్టి ముఖంపై సున్నితంగా రుద్దండి. ఇది ముఖ రంధ్రాలను బిగించి చర్మానికి తాజా రూపాన్ని ఇస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని తాజాగా కనిపించేలా చేస్తుంది.
Also Read: ఇంట్లోనే ఫేస్ సీరం.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?
6. ముల్తానీ మిట్టి:
చర్మాన్ని మెరిసేలా చేయడంలో ముల్తానీ మిట్టి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది తక్షణ మెరుపును అందిస్తుంది. ముల్తానీ మిట్టిలో తగినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇది తక్షణ మెరుపును కూడా అందిస్తుంది.