BigTV English

Rose Water Benefits: రోజ్ వాటర్‌తో మెరిసే చర్మం మీ సొంతం !

Rose Water Benefits: రోజ్ వాటర్‌తో మెరిసే చర్మం మీ సొంతం !

Rose Water Benefits: అందంగా మెరిసిపోవాలని అందరూ తాపత్రయ పడుతుంటారు. అలాంటి వారికోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. ముఖ అందాన్ని రెట్టింపు చేయడంలో రోజ్ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజు వాటర్‌‌లో చర్మ నాణ్యతను పెంచే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.


గులాబీ రేకుల నుంచి తయారు చేసిన రోజ్ వాటర్ సహజ సౌందర్యాన్ని పెంపొందించి చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. మార్కెట్లో దొరికే రక రకాల సౌందర్య సాధనాలు, సుగంధ ద్రవ్యాల్లోనూ రోజ్ వాటర్ ను వాడుతుంటారు. హైడ్రేటింగ్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇది కలిగి ఉండటం వల్ల చర్మంపై దద్దుర్లు వంటివి రాకుండా చేస్తుంది.

సువాసన కలిగి ఉండే రోజ్‌వాటర్ ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి వాటిని కూడా దూరం చేస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని కూడా మెరుగు పరుస్తుంది. రెండు చుక్కల రోజ్‌వాటర్ మీ వంటకాలకు, పానీయాలకు కూడా చక్కటి రుచిని అందిస్తుంది. ముఖ్యంగా స్వీట్లు రిఫ్రెషింగ్ డ్రింక్‌లో ఇది వాడితే వాటికి మంచి రుచి, సువాసన వస్తాయి. రోజువాటర్‌తో చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


పీహెచ్ బ్యాలెన్స్ :
రోజ్ వాటర్ సహజమైన టోనర్ లాగా పనిచేస్తుంది. చర్మ రక్షణకు సహాయపడే పీహెచ్ సమతుల్యతను నియంత్రించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. చర్మంపై ఉన్న మొటిమలను తగ్గించి మృదువైన చర్మాన్ని అందిస్తుంది. ముఖంపై ఉండే అదనపు నూనెలు కూడా తొలగిస్తుంది.

దురద, వాపు :
చర్మంపై వచ్చే ,దురద వంటి వాటిని తగ్గించే లక్షణాలు రోజ్ వాటర్ లో ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సున్నితంగా మార్చి చికాకు నుంచి దూరం చేస్తాయి. ముఖ్యంగా రోసేసియా తామర వంటివి వచ్చినప్పుడు కలిగే ఎరుపు దురద వాపులను కూడా ఇవి తగ్గిస్తాయి.
వృద్ధాప్య ఛాయలకు దూరంగా :
రోజ్ వాటర్ సహజమైన యాంటీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గించి ముఖంపై గీతలు, ముడతలు, మచ్చలు వంటివి రాకుండా చేస్తుంది. రోజు వాటర్ ఉపయోగించడం వల్ల అందమైన చర్మాన్ని పొందవచ్చు.

Also Read: రక్త పోటుకు కివీ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది.. ఓసారి ట్రై చేయండి

హైడ్రేషన్ :
నిర్జీవంగా, పొడిగా కనిపించే చర్మం ఉన్నవారు రోజ్ వాటర్ ఉపయోగించడం మంచిది. దీనిలో ఉండే హైడ్రేటింగ్ చర్మానికి అవసరమైన తేమను అందించి ఆకర్షణీయంగా మారుస్తుంది. అంతే కాకుండా మృదువుగా మార్చి యవ్వంగానే కనిపించేలా చేస్తుంది. రోజ్ వాటర్ పునరుజ్జీవ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల సహజమైన కాంతి మన సొంతమవుతుంది.

Related News

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Big Stories

×