Benefits Of Kiwi Juice: కివి పండుకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. కేవలం నాలుగు కాయలు వంద రూపాయల నుంచి దాదాపు 150 రూపాయల ఖరీదు ఉంటుంది. అయితే కివి పండు ఖరీదు కంటే దానితో కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. కివి పండును తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు కివి పండు రూపంలోనే కాకుండా కివి జ్యూస్ తాగినా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే కివిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల కివి తింటే మలబద్ధకం, కడుపు సంబంధింత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు కివి జ్యూస్ తాగడం వల్ల అధిక బరువు వంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు.
కంటి చూపు మందగించడం, లేదా కళ్ల మంట, దురద వంటి సమస్యలు ఉన్న వారు కూడా కివి జ్యూస్ తాగితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాదు వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు కూడా నయం అవుతాయి. అందువల్ల వర్షాకాలంలో కివిని తరచూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు శరీరం బహీనంగా ఉండడం, నిరసం, అలసట వంటి సమస్యలు తొలగించడానికి కూడా కివి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం వంటి సమస్యలకు కూడా కివి పనిచేస్తుంది. ముఖ్యంగా చర్మం, జుట్టు సమస్యలు ఎదుర్కునే వారు కూడా కివి జ్యూస్ తరచూ తీసుకుంటే మంచిది. క్రమం తప్పకుండా కివి జ్యూస్ తాగితే ఇన్పెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కివిలో ఉండే పొటాషియం, మెగ్నీషియంతో జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు కివి జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊబకాయాన్ని నియంత్రించడంలో తోడ్పడుతుంది. అందువల్ల కివిని తరచూ తీసుకుంటే మంచిది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)