Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈయన గత కొద్ది రోజుల క్రితం సూర్య (Suriya)నటించిన రెట్రో (Retro)సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు (Tribal Community)ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారు అంటూ గిరిజన సంఘాలు ఈయనపై మండిపడుతూ ఇటీవల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో విజయ్ దేవరకొండ స్పందించారు.
ఎవరిని బాధ పెట్టాలని కాదు..
తాను ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదని, ఆరోజు నేను మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశిస్తూ, కించపరిచే విధంగా మాట్లాడలేదని, ఆ మాటల కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అంటూ క్షమాపణలు కోరడమే కాకుండా అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే విషయాల గురించి కూడా వివరణ ఇచ్చారు. ఆరోజు నేను కాశ్మీర్ గురించి మాట్లాడుతూ కాశ్మీర్ ఇండియాదేనని మనమంతా యూనిటీతో ఉండాలన్న ఉద్దేశంతోనే మాట్లాడాలని తెలిపారు.
గిరిజనలు..
ఇక తాను గిరిజనులు అనే పదం మాట్లాడటానికి కూడా కారణం లేకపోలేదని తెలిపారు. ఈ పదాన్ని మనం కొన్ని శతాబ్దాల క్రితం మానవ సమాజం ప్రపంచవ్యాప్తంగా తెగలు మరియు వంశాలుగా వ్యవస్థీకృతమై, తరచుగా సంఘర్షణలో ఉన్న కాలాన్ని సూచిస్తుంది. ఇది షెడ్యూల్డ్ తెగల వర్గీకరణకు సూచన కాదని తెలియజేశారు. ఇది అప్పట్లో వలసల వెళ్లిన రాజ్యాలు అలాగే వలస రాజ్యాల అనంతరం భారతదేశంలో ప్రవేశపెట్టారు. 20వ శతాబ్దంలో మాత్రమే దీనిని అంగీకరించబడిందని కూడా తెలియజేశారు.
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025
నా కుటుంబంతో సమానం..
ఇలా తన మాటల కారణంగా ఎవరైనా ఇబ్బందిపడినా, తనని క్షమించాలని ఉద్దేశపూర్వకంగా అయితే చేసిన వ్యాఖ్యలు కాదని తెలిపారు. మనదేశంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండాలని తాను కోరుకుంటానని, భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా నా సోదరులుగానే నా కుటుంబ సభ్యులు గానే భావిస్తాను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ గిరిజనులను ఉద్దేశిస్తూ తప్పుగా మాట్లాడలేదంటూ వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా ఈయన పట్ల చెలరేగిన ఈ వివాదంపై స్పందిస్తూ సుదీర్ఘమైనటువంటి వివరణ ఇస్తూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చిన అనంతరం గిరిజన సంఘాలు ఇతని పట్ల పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో ఇలాంటి వరుస వివాదాలలో చిక్కుకుంటూ ఉన్నారు ఈయన కేవలం తన మాట తీరు కారణంగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఆయన ఉద్దేశం వేరే అయినప్పటికీ ఆయన మాట తీరు కారణంగానే వివాదాలలో నిలుస్తున్నారు.
Also Read: అకీరా హీరో మెటీరియల్ కాదు.. హీరో అవ్వటం కష్టమేనా?