Shekar Master : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఈయనే నెంబర్ వన్.. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియో గ్రాఫర్ గా పనిచేసారు. అయితే ఈ మధ్య మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు కొందరి చేత విమర్శలు వేయించుకున్నాయి. మరి కొన్ని స్టెప్పులు అవార్డు లను అందుకోనేలా చేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే మాస్టర్ సినిమాలు మాత్రమే కాదు బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు షోలకు హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. తాజాగా ఓ షోలో ఆయనకు ఘోర అవమానం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శేఖర్ మాస్టర్ ను అవమానించిన హీరో..
శేఖర్ మాస్టర్ టాలీవుడ్ మూవీలతో పాటుగా తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలకు కొరియో గ్రాఫర్ గా వ్యవహారిస్తున్నారు. ఆయన చేసిన సినిమాలకు అవార్డులు దక్కించుకోవడంతో ప్రస్తుతం మాస్టర్ పేరు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి చేరిపోయాడు. అయితే మాస్టర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు కార్యక్రమాల్లో సందడి చేస్తుంటారు. తాజాగా ఓ షోలో మాస్టర్ కు అవమానం జరిగింది. ఓ హీరో ఆయన పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ షో వీడియో వైరల్ అవ్వడంతో మాస్టర్ కు అవమానం జరిగిందని ప్రచారం జరుగుతుంది..
Also Read :యాంకరింగ్ కు గుడ్ బై.. ఇక అంతా ఆయనతోనే..
హీరో పై శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ ఫైర్..
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2’కు శేఖర్ మాసర్ట్ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ షోకు సంబంధించిన మొదటి సీజన్ విజయవంతమైంది. ఆ సీజన్ లో కిర్రాక్ బాయ్స్ టైటిల్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం సీజన్ 2లో అమ్మాయిలు, అబ్బాయిల టీమ్ కు పోటాపోటీగా టాస్క్ లు జరుగుతున్నాయి. అయితే ప్రతి వారం మూవీ ప్రమోషన్స్ కోసం హీరోలు బుల్లి తెర షోలతో సందడి చేస్తారు. అలాగే ఈ షోలో సారంగపాణి జాతకం మూవీ ప్రమోషన్స్ కోసం బలగం ఫేమ్ హీరో ప్రియదర్శి షోలో సందడి చేశారు. అయితే శేఖర్ మాస్టర్ పేరు చెప్పలేక పోయాడు. పేరు తెలియనట్లు సురేష్ అన్నాడు. దానికి మాస్టర్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇప్పటికే ఈ వీడియోను చూసిన ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రియదర్శి పై కామెంట్స్ చేస్తున్నారు. ప్రియదర్శిని సరిచేసే ప్రయత్నం చేస్తాడు. పేరు తప్పుగా చెప్పడం తో ప్రియదర్శి కూడా నాలుక కరుచుకుంటాడు. ఏదేమైనా ఇండియాలోనే స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తున్న శేఖర్ మాస్టర్ పేరే మర్చిపోవడం హాట్ టాపిక్ గ్గా మారింది. అంత పెద్ద కోరియోగ్రాఫర్ పేరు గుర్తు పెట్టుకోకపోవడం ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.