Ice For Skin Glow: అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకే అమ్మాయిలు తమ ముఖంపై అంతగా శ్రద్ధ చూపుతారు. కాలుష్యం, వయస్సు పెరగడం, తీవ్రమైన సూర్యకాంతి , అనేక ఇతర కారణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. అంతే కాకుండా వీటి వల్ల ముఖంపై నల్లటి మచ్చలు, మొటిమలు, దద్దుర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
అయినప్పటికీ ముఖం నీరసంగా, నిర్జీవంగా కనిపించడం ప్రారంభమవుతుంది. వీటిని నివారించడానికి.. మనం ఖరీదైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడుతుంటాం. వివిధ రకాల ఫేషియల్స్ , అనేక ఇతర క్రీములను కూడా ఉపయోగిస్తాము. కానీ మీ చర్మాన్ని ఇంట్లోనే మెరిసేలా చేసుకోవడానికి ఐస్ క్యూబ్స్ కూడా ఉపయోగించవచ్చు.
ముఖం మీద ఐస్ సరిగ్గా వాడితే.. అది చర్మానికి కొత్త జీవం పోస్తుంది. మేకప్ ఆర్టిస్టులు మేకప్ ప్రైమర్ నుండి చీక్ బోన్ షేపింగ్ వరకు ప్రతిదానికీ ఐస్ ఉపయోగిస్తారు. మీరు ముఖంపై అలసటను కూడా తొలగించాలనుకుంటే ఐస్ ఉపయోగించండి.
ముఖం మీద మొటిమలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే. లేదా వేడి కారణంగా మంటగా అనిపిస్తే.. ఐస్ క్యూబ్స్ చాలా సహాయ పడతాయి. ముఖంపై ఐస్ క్యూబ్‌తో రుద్దడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. మీకు కావాలంటే.. మీరు దానిలో కాఫీ, గ్రీన్ టీ లేదా పాలు కలిపి ఫ్రీజ్ చేయవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా చర్మానికి కొత్త మెరుపు వస్తుంది.
చర్మం యవ్వనంగా , ప్రకాశవంతంగా కనిపించడానికి సీరం అప్లై చేసిన తర్వాత.. ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేయడం వల్ల సీరం చర్మం లోపలి ఉపరితలాన్ని చేరుకోవడానికి ఇది సహాయపడుతుంది. దీని యొక్క ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఐస్‌ను పలుచని క్లాత్‌లో చుట్టి ముఖంపై మసాజ్ చేయాలి. ముఖంపై బ్లాక్ హెడ్స్, మొటిమలు, ముఖ రంధ్రాల కోసం ఐస్ బాగా ఉపయోగపడుతుంది.
ఐస్ క్యూబ్స్:
మొటిమలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అలోవెరా జెల్‌ను ఐస్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేయండి. దీనితో ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మం తాజాగా ఉండటమే కాదు. నిజానికి, ఇది మొటిమల నుండి కూడా ఉపశమనం అందిస్తుంది. అలోవెరా జెల్ తో తయారు చేసిన ఐస్ క్యూబ్స్ ముఖం నుండి అలసటను తొలగించడంలో సహాయ పడతాయి. అంతే కాకుండా చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తాయి.
Also Read: ముఖం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి !
ఐస్ క్యూబ్స్ తో ముఖంపై మసాజ్ చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఒక గిన్నెలో చల్లటి నీటిని నింపి. అందులో కొన్ని ఐస్ క్యూబ్ లను వేసి ముఖాన్ని అందులో 15 సెకన్ల పాటు ముంచండి. ఈ ప్రక్రియను మూడు నుండి నాలుగు సార్లు చేయండి. ఇది ముఖ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా కాంతి వంతమైన చర్మాన్ని మీకు అందిస్తుంది.