OTT Movie : మూగ సినిమాల నుంచి డిజిటల్ సినిమాల వరకు ఓటిటి ప్లాట్ ఫామ్ అందుబాటులో ఉంది. ఏ సినిమా కావాలనుకుంటే, ఆ సినిమాను చూసుకుంటూ ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకునే ఫిలిప్పీన్ మూవీ 1986 లో వచ్చింది. ట్రైబర్స్ లా నాగరికతకు కాస్త దూరంగానే నివసించే కొంతమంది మనుషులు చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పెద్దలకు మాత్రమే అన్నట్టుగా ఉంటుంది. దీనిని కూడా ఒంటరిగా చూడటమే మంచిది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
ప్లే పైలట్ (Play pilot) లో
ఈ ఫిలిప్పీన్ మూవీ పేరు ‘సిలిప్ : డాటర్స్ ఆఫ్ ఈవ్’ (Silip : daughters of Eve). 1986 లో వచ్చిన ఈ ఫిలిప్పైన్ సెక్స్‌ప్లోయిటేషన్ సైకలాజికల్ డ్రామా మూవీకి ఎల్‌వుడ్ పెరెజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సిలిప్ గా తెరకెక్కించారు మేకర్స్. ఆ తరువాత ఫిలిప్పీన్స్ బయట ‘డాటర్స్ ఆఫ్ ఈవ్‌గా’ విడుదలైంది. ఒక దీవిలో ఉండే అనాగరికుల చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్లే పైలట్ (Play pilot) వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.
స్టోరీ లోకి వెళితే
ఒక దీవిలో కొంతమంది మనుషులు నాగరికతకు దూరంగా బతుకుతుంటారు. వీళ్లకు పగలు పనిచేయడం, రాత్రి అయితే శృంగారం చేయడం తప్పించి వేరే ధ్యాస ఉండదు. అదే ఊరిలో సైమన్ అనే వ్యక్తి అమ్మాయిలతో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. పెళ్లి అయినా కూడా ఇతడు పద్ధతి మార్చుకోడు. భార్యని ఎక్కువగా సెక్స్ కోసం వేధిస్తుంటాడు. ఇదంతా చూసి ఇతని కొడుకు సైమన్ పై కోపం పెంచుకుంటాడు. మరోవైపు అక్కడే ఉండే తన్యా అనే అమ్మాయి పిల్లలకి దైవ మార్గం లో ఉండాలని చెప్తూ ఉంటుంది. ఆమె తల్లి కూడా ఇలాగే ప్రజల్లో మార్పు తీసుకురావాలని అనుకొని చనిపోయి ఉంటుంది. తన్యాకి ఒక చెల్లెలు కూడా ఉంటుంది. ఒక రోజు సిటీ నుంచి తన భర్తతో కలిసి తిరిగి వస్తుంది. చెల్లెలికి మాత్రమే కాస్త లోకజ్ఞానం తెలిసి ఉంటుంది. ఆమె కూడా సైమన్ కి పడిపోయి ఉంటుంది.
ఇంటికి భర్తతో వచ్చిన తాన్య సిస్టర్, రాత్రి పూట ఒంటరిగా వెళ్లి సైమన్ తో ఇంటిమేట్ అవుతుంది. ఈ విషయం తెలిసి తాన్య ఆమెను గట్టిగా మందలిస్తుంది. కొన్ని రోజులకు తాన్య కూడా సైమన్ కి లొంగిపోతుంది. ఇవన్నీ చూసిన సైమన్ కొడుకు తండ్రిని చంపాలని అనుకుంటాడు. తాన్య సైమన్ తో ఏకాంతంగా గడపడం ఒక అమ్మాయి చూస్తుంది. చెప్పేవి శ్రీరంగనీతులు దూరేది గుడిసెల్లో అనుకుంటూ ఆమె గురించి చెడుగా అందరికీ చెప్తుంది. ఆమెపై కోపం పెంచుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు. చివరికి కొడుకు చేతిలో సమన్ చనిపోతాడా? తాన్యను ఊరి జనం ఏం చేస్తారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘సిలిప్ : డాటర్స్ ఆఫ్ ఈవ్’ (Silip : daughters of Eve) అనే ఈ మూవీని చూడండి.